పై ఫొటోలో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? అతను ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్..!

ఏమీ తెలియని అమాయకుడిలా కనిపిస్తున్న ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ కుర్రాడే హాట్ టాపిక్.. అయితే ఇప్పుడు ఇలా లేడులెండి. పోస్టర్, టీజర్ ల నుంచే వివాదాలకు కారణమైన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చిన్ననాటి ఫోటో ఇది. అర్జున్ రెడ్డి సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో అందరి దృష్టి విజయ్ దేవరకొండ మీద పడింది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగిందన్న విషయం తెలియకపోయినా.. సినీ జనాలు ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోనే కాదు.. ఆడియో ఫంక్షన్ లోనూ బోల్డ్ కామెంట్స్ తో షాక్ ఇచ్చిన కుర్రాడు ఒకప్పుడు ఇంత అమాయకంగా కనిపించేవాడంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Comments

comments

Share this post

scroll to top