ఆ 10 వ తరగతి అమ్మాయిని రేప్ చేసి ఆమె ప్లేస్ లో డమ్మి స్టూడెంట్ తో పరీక్ష రాయించాడు ఆ ప్రిన్సిపాల్.!

ఎంతో మంది నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఉంటున్న సమాజం మనది. కొందరు మేక తోలు కప్పుకున్న మృగాల్లా మన మధ్యే ఉంటున్నారు. కానీ మనం వారిని గుర్తించలేకపోతున్నాం. దీంతోవారు అకృత్యాలకు పాల్పడుతున్నారు. చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడేలా వ్యవహరిస్తున్నారు. కామంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. వారి బారిన పడి అమాయకులు బలవుతున్నారు. ఆ ప్రాంతంలో కూడా అలాగే జరిగింది. తాను చదువు చెప్పే విద్యార్థినిని సొంత కూతురిలా భావించాల్సిందిపోయి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఇప్పుడా బాధితురాలికి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

అది హర్యానాలోని సోనిపట్‌ అనే ప్రాంతంలో ఉన్న గొహానా అనే టౌన్‌. అక్కడ ఓ స్కూల్‌లో ఓ విద్యార్థిని (16) 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తండ్రిని ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ట్రాప్‌ చేశాడు. తనకు డబ్బు ఇస్తే ఆమెను బోర్డు పరీక్షల్లో పాస్‌ చేయిస్తానని నమ్మ బలికాడు. దీంతో ఆ తండ్రి ఆశ పడి ఆ ప్రిన్సిపాల్‌కు రూ.10వేలు ఇచ్చాడు. ఈ నెల 8వ తేదీన పరీక్ష ఉండగా ఆ రోజు గొహానా టౌన్‌ శివారులో ఓ ఇంటికి ఆ ప్రిన్సిపాల్‌ ఆ తండ్రి తన కూతురితో సహా రమ్మన్నాడు.

ప్రిన్సిపాల్‌ చెప్పిన మాట ప్రకారం ఆ తండ్రి తన కూతురిని వెంట బెట్టుకుని అతను చెప్పినట్టుగా ఆ ఊరి శివారులో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ అప్పటికే వేచి ఉన్న ఆ ప్రిన్సిపాల్‌ ఆ విద్యార్థినిని అక్కడే ఉండమన్నాడు. ఆమెకు బదులుగా పరీక్ష ఇంకో విద్యార్థిని రాస్తుందని చెప్పాడు. ఆ తండ్రిని అక్కడి నుంచి వెళ్లమన్నాడు. పరీక్ష అయ్యాక వచ్చి తన కూతుర్ని తీసుకెళ్లమన్నాడు. దీంతో ఆ తండ్రి నమ్మి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరు మహిళలు కూడా ఉండడంతో తన కూతురు సేఫ్‌గానే ఉంటుందని ఆ తండ్రి అనుకున్నాడు. దీంతో అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు. తరువాత ఆ ప్రిన్సిపాల్‌ ఆ ఇద్దరు మహిళల సహాయంతో ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఇక పరీక్ష సమయం అయ్యాక ఆ తండ్రి వచ్చి చూడగా తన కూతురు అత్యంత దీనస్థితిలో పడి ఉంది. దీంతో జరిగిన విషయం తెలుసుకుని అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే తన కూతుర్ని హాస్పిటల్‌ లో చేర్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రిన్సిపాల్‌తోపాటు ఆ ఇద్దరు మహిళలు కూడా పరారీలో ఉన్నారు. నిజంగా ఇలాంటి పని చేసిన వారిని అంత తేలిగ్గా అయితే వదలకూడదు. కఠినంగా శిక్షించాలి..!

Comments

comments

Share this post

scroll to top