లావుగా ఉన్నారు..సన్నగా అవ్వొచ్చు కదా అన్న రిపోర్టర్ కు “విద్య బాలన్” హైలైట్ కౌంటర్..! ఏమందో తెలుసా?

ఒక‌ప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు మాత్రం సినీ రంగంలో హీరోయిన్లు అవ‌కాశాలు రావాలంటే స్లిమ్ముగా, ట్రిమ్ముగా ఉండాల్సిందే. లావుగా, బొద్దుగా ఉంటామంటే కుద‌ర‌దు. స్లిమ్‌గా ఉంటేనే హీరోయిన్ అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌స్తాయి. దీనికి తోడు గ్లామ‌ర్‌గా కూడా క‌నిపించాలి. స‌రే గ్లామ‌ర్ విష‌యం పక్క‌న పెడితే అస‌లు బాడీ స్లిమ్‌నెస్ చాలా ముఖ్యం. అప్పుడే అంద‌రి దృష్టిలో ప‌డ‌తారు. అయితే చాలా మంది హీరోయిన్లు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో లావ‌యిపోతున్నారు. వారిలో విద్యాబాల‌న్ కూడా ఒక‌రు. పెళ్లి కాక ముందు ఈమెకు ఆఫ‌ర్లు బాగానే వ‌చ్చాయి. పెళ్లయ్యాక కూడా ఒక‌టి, రెండు సినిమాలు చేసింది. కానీ త‌గిన పేరు రాలేదు. అయితే ఈ మ‌ధ్యే ఓ రిపోర్ట‌ర్ విద్యాబాల‌న్‌ను ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఓ ప్ర‌శ్న అడిగాడు. అదేమిటంటే…

మేడ‌మ్‌.. మీరు స‌న్న‌గా మార‌వ‌చ్చు క‌దా. సినీ ఇండ‌స్ట్రీలో స‌న్న‌గా ఉంటే అవ‌కాశాలు వ‌స్తాయి, దాంతో వుమెన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్‌లో అయినా మీరు న‌టించ‌వ‌చ్చు, మీరు బ‌రువు త‌గ్గితే బాగుంటుంది, అలా ఎందుకు ఆలోచించ‌డం లేదు, అని ఓ విలేక‌రి విద్యాబాల‌న్‌ను అడిగాడు. అయితే ఇందుకు విద్యాబాల‌న్ మొద‌ట షాక్ అయినా ఆ విలేక‌రికి త‌గిన రిప్లై ఇచ్చింది. మీరు అన్న‌ది నిజ‌మే. కానీ నా బాడీ నా ఇష్టం. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. నేను చేస్తున్న ప‌ని పట్ల సంతృప్తిగానే ఉన్నా. మీరే మీ మెంటాలిటీ మార్చుకోవాలి. అని విద్యాబాలన్ రిప్లై ఇచ్చే స‌రికి ఆ విలేక‌రికి దిమ్మ తిరిగిపోయింది.

అవును మ‌రి. ఎంత హీరోయిన్లు అయినా వారికి న‌చ్చిన‌ట్టు వారుంటారు క‌దా. సినిమా అవకాశాల కోసం స్లిమ్ అవ‌డం స‌హ‌జ‌మే, కానీ స్లిమ్ అవ‌నంత మాత్రాన వారు ఏదో నేరం చేసిన‌ట్టు కాదు క‌దా. అందుకు జ‌నాల‌కు ఎందుకు అంత ఇంట్రెస్ట్‌. వారు కూడా మ‌న‌లాగే సామాన్య మ‌నుషులే క‌దా. వారికీ ఇష్టాలు ఉంటాయి. వారికి న‌చ్చిన‌ట్టు ఉంటారు. వాటిని ప్ర‌శ్నిస్తే.. చూశారు క‌దా. పైన ఇచ్చిన‌ట్టు స‌మాధానం షాక్ రూపంలో వ‌స్తుంది..!

Comments

comments

Share this post

scroll to top