శ్రీదేవి దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి ,బాలివుడ్లో తన సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ హోదాని సొంతం చేసుకుంది.అందం ,అభినయం కలగలిపిన శ్రీదేవి తెలుగు,తమిళం,మళయాళం,కన్నడ హింది భాషల్లో 270 సినిమాలు చేసింది.శ్రీదేవి ఉంటే చాలు హిట్ అవుతుందనే మ్యాజిక్ మంత్రం అప్పట్లో బాగా ఉండేది..దాంతో అటు డిస్ట్రిబ్యూటర్లు,ఇటు ప్రేక్షకులు కూడా ఆ సినిమాల మీద అంచనాలు పెట్టుకునేవారు.అయితే శ్రీదేవి నటించిన కొన్ని సినిమాలు విడుదల అవ్వలేదనే విషయం మీకు తెలుసా… కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి,మరికొన్ని షూటింగ్ పూర్తి చేసినప్పటికి ప్రేక్షకులవరకు రాలేదు..ఇంతకీ ఆ సినిమాలేవో తెలుసా..
- 1988లో డైరెక్టర్ రమేష్ సిప్పీ… వినోద్ ఖన్నా, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లతో “జమీన్” సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో కొంత భాగం కూడా చిత్రీకరించారు. తరువాత ఆగిపోయింది. ఇది పూర్తయితే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు కలసిన నటించిన తొలి సినిమా అయ్యేది.
- రమేష్ సిప్పి 1991లో శ్రీదేవి, వినోద్ ఖన్నా, రుషి కపూర్లతో ‘గర్జన’ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ అయినా, సినిమా షూటింగ్ జరగలేదు. స్టార్కాస్ట్ విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.
- డైరెక్టర్ అనిల్ శర్మ 1990లో అనిల్ కపూర్, శ్రీదేవిలో ‘మహారాజ్’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది.
- 1996లో అనిల్‌కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తాను, శ్రీదేవి కలిసి ‘గోవిందా’ అనే సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ అయినప్పటికీ, సినిమా చిత్రీకరణ జరగలేదు.
అప్పట్లో ఆగిపోయిన తన సినిమాల గురించి శ్రీదేవి బాధపడేది కాదట.. ఎందుకంటే వాటి గురించి ఆలోచించే తీరిక ఆమెకి ఉండేది కాదని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో తెలిపింది.నిజమే కదా బాలనటిగా ఉన్నప్పుడే రోజుకు మూడు షిప్టులు పనిచేసేదని చెప్తుంటారు.ఇక సూపర్ స్టార్ అయ్యాక తన పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు.