మాటల్లో చెప్పలేని భావం ఓ ఫోటో ద్వారా తేలికగా చెప్పవచ్చు… గంట ఉపన్యాసం లో పంపించలేని సందేశం పది సెకండ్ల వీడియోతో గుండె లోతుల్లోకి జొప్పించొచ్చు…. అందుకే ఆధునిక సమాజంలో సినిమా అత్యత ప్రభావ పూరిత వస్తువు గా మారింది. ఇప్పుడు మీకు ఓ వీడియో చూపిస్తా.. చూసేప్పుడు ఏం అర్థం కాకపోవచ్చు కానీ.. తర్వాత అది మనల్ని ఆలోచింపజేస్తుంది.
మనం మన కన్న తక్కువ స్థాయి వ్యక్తులను .. ఎప్పుడు చిన్నచూపుతో చూస్తుంటాం. బాహుషా ఈ వీడియో చూశాక మీరు అలా చేయకపోవొచ్చు. మార్పుకు శ్రీకారం ఈ వీడియో అయితే అంత కన్న సంతోష విషయం మరోటి లేదు.
Watch Video Here:
వాచ్ మెన్లను, ఇంట్లో పని చేసే వారిని, రిక్షా వాళ్ళను.. ఇలా స్థాయిని బట్టి తమ కన్నా తక్కువ ఉన్న వారిని ప్రతి ఒక్కరూ చులకనగానే చూస్తుంటారు. మనిషి ని మనిషిగా గుర్తించగలగాలి..