అనసూయ చెంప చెళ్లుమనిపించిన పోలీస్ ఆఫీసర్, వైరల్ అవుతున్న వీడియో.!!

యాంకర్ అనసూయ చెంప చెళ్లుమనిపించిన పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది సోషల్ మీడియా లో, జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యింది, రంగస్థలం సినిమాలో రంగమ్మత పాత్ర ద్వారా అందరిని ఆకట్టుకుంది అనసూయ, ఆ తరువాత అనసూయ సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యింది.

ముఖ్య పాత్ర లో..

అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి టీం వాళ్ళు వదిలారు, అందులో హీరో గా నటిస్తున్న అతను ఒక సమయం లో అనసూయ ను కొడతాడు, సినిమా లో ఈ సీన్ ఉంది, ఆ మేకింగ్ వీడియో లోనుండి చిన్న బిట్ కట్ చేసి పోలీస్ ఆఫీసర్ అనసూయ ని కొట్టినట్టు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా లో, అయితే ఈ వీడియో లో చెంపదెబ్బ సీన్ వల్ల సినిమాకి మంచి ప్రమోషన్ లభించిందని జనాలు అనుకుంటున్నారు. కథనం సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, ధన్ రాజ్ తదితరులు నటించారు.

తరుణ్ భాస్కర్ తో సినిమా మీద.. :

యాంకర్ అనసూయ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరో గా నటిస్తున్న చిత్రం లో హీరోయిన్ గా నటించనుందని చాలా రోజుల నుండి జోరుగా వినిపిస్తున్న పుకారు, ఇదే విషయం పైన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ‘తరుణ్ భాస్కర్ తో నటిస్తున్న విషయం నిజమే, కానీ ఆ సినిమాలో నాది చాలా ముఖ్య పాత్ర. నేను హీరోయిన్ గా నటించడంలేదు. తరుణ్ భాస్కర్ తో రొమాన్స్ చేసే పాత్ర కాదు నాది సినిమాలో, సినిమాలో నాది చాలా ముఖ్యమైన రోల్. ఈ సినిమాలో నా పాత్ర గురుంచి ఇప్పుడే చెప్పలేను’ అని అనసూయ తెలిపారు.

కథనం సినిమా గురించి.. :

‘నేను లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం కథనం. ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్న అని వస్తున్న పుకార్లలో నిజం లేదు, క్షణం మూవీ లో పోలీస్ పాత్ర చేసినందుకు ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్ర చేశా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో నేను పోలీస్ పాత్ర లో నటించలేదు. కథనం సినిమా లో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర లో నటించాను. నిర్మాతలు బీ నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రను నాతో చేయించారు. ఈ సినిమాలో సోలోగా కథను నడిపించే పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది’ అని అనసూయ చెప్పారు.

వేసవి సెలవుల్లో.. :

కథనం సినిమా వేసవి సెలవుల్లో రిలీజ్ కానుంది, టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని అనసూయ తెలిపారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top