విడాకుల పంచాయితీకి ఆహ్వానం అంటూ కరపత్రాలు పంచుతున్న భర్త!

మా పెళ్ళికి రండీ అంటూ పెళ్లి కార్డులు పంచడం సర్వసాధారణమే. అయితే వరంగల్ లో మాత్రం సీన్ కాస్త ఛేంజ్ అయ్యింది. సినిమాను తలపించేలా మా విడాకుల పంచాయితీకి రండీ అంటూ ఆహ్వాన పత్రికలు పంచుతున్నాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగున్నర సంవత్సరాల క్రితం దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడిన సురేష్ ఆమెను పుట్టింటికి పంపించాడు.బావమరిది రమేష్‌తోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సురేష్ మరో ఐదుగురితో కలిసి నారాయణగిరికి వచ్చి ఫిబ్రవరి 14న జరిగే ‘విడాకుల పంచాయితీకి ఆహ్వానం’ అని ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశాడు.

09-1455000431-vidakulu

వాటిని చూసి గ్రామస్తులు  ఆ కరపత్రాలు పంచుతున్న వారిని పట్టుకోగా, సురేష్ తప్పించుకున్నాడు. అతడితో పాటు కరపత్రాలను పంచుతున్న మిగితా వారిని పట్టుకొని ప్రశ్నించగా  తమకు చదువురాదని, రూ. 300 కూలి ఇస్తామంటే వచ్చి కరపత్రాలు పంచుతున్నామని తెలిపారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

Comments

comments

Share this post

scroll to top