బ్రిట‌న్ రాణి విక్టోరియా, భార‌త స‌ర్వెంట్ అబ్దుల్ క‌రీంల అన్యోన్య బంధం గురించి మీకు తెలుసా..?

రాజ కుటుంబాలు అంటేనే వైభోగానికి, విలాసాల‌కు నెల‌వు. ఇక వారి ఇండ్లు అయితే స్వ‌ర్గం దిగివ‌చ్చిందా.. అన్న రేంజ్ లో ఉంటాయి. అయితే వీటి గురించి పక్క‌న పెడితే రాజ నివాసాల్లో జ‌రిగే విష‌యాలేవీ సాధార‌ణంగా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌వు. ఏమైనా వివాదాలు చెల‌రేగినా, ఏవైనా ఘ‌ట‌న‌లు జ‌రిగినా అవి సాధారణ జ‌నాల‌కు తెలియ‌వు. ఇప్పుడంటే మీడియా పుణ్య‌మా అని చాలా వ‌ర‌కు ఇలాంటి విష‌యాలు తెలుస్తున్నాయి, కానీ ఒక‌ప్పుడు అలా కాదుగా. అస‌లు ఆ ఇండ్ల‌లో జ‌రిగే ఒక్క విష‌యం గురించి కూడా ఎవ‌రికీ తెలిసేది కాదు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇలాంటి ఓ అంశం గురించే. అది క్వీన్ విక్టోరియా, ఆమె స‌ర్వెంట్ అబ్దుల్‌ క‌రీం గురించి. ఇంత‌కీ వీరి విష‌యం ఏమిటంటే…

అప్ప‌ట్లో.. అంటే… 1887వ సంవ‌త్స‌రంలో క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ వేడుక‌ల‌ను యూకేలో నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. అయితే క్వీన్ విక్టోరియా ఆ వేడుక‌ల‌కు ప‌లువురు భార‌త‌దేశ రాజులను కూడా ఆహ్వానించింది. దీంతో వారు కూడా వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే భార‌తీయ రాజుల కోసం భార‌త‌దేశానికే చెందిన స‌ర్వెంట్లు అయితే బాగుంటుంది అన్న కోణంలో ఆలోచించిన క్వీన్ విక్టోరియా భార‌త్ నుంచి పలువురిని స‌ర్వెంట్లుగా బ్రిట‌న్‌కు తీసుకుర‌మ్మ‌ని ఇండియాలో ఉన్న బ్రిటిష్ అధికారుల‌కు చెప్పింది. దీంతో వారు అలాగే చేశారు. అలా భార‌త్ నుంచి వెళ్లిన స‌ర్వెంట్ల బృందంలో అబ్దుల్ క‌రీం కూడా ఉన్నాడు. అత‌నిది ఝాన్సీ.

ఈ క్ర‌మంలోనే అబ్దుల్ క‌రీం ఆ వేడుక‌ల్లో క్వీన్ విక్టోరియా కంటబ‌డ్డాడు. అత‌ని అమాయ‌క‌త్వం, సేవాత‌త్వం వంటి అనేక విష‌యాలను తెలుసుకున్న క్వీన్ విక్టోరియా అబ్దుల్ క‌రీంను త‌న ద‌గ్గ‌రే ప్యాలెస్‌లో ఉండ‌మ‌ని కోరింది. దీంతో అబ్దుల్ క‌రీం క్వీన్ వ‌ద్దే ఉన్నాడు. అయితే ఆమెకు ఎందుకో అబ్దుల్ క‌రీం సొంత కొడుకులా అనిపించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య త‌ల్లీ కొడుకుల్లా అన్యోన్య బంధం ఏర్ప‌డింది. ఇద్ద‌రూ మంచి స్నేహితుల్లా కూడా మారారు. ఈ క్రమంలోనే అబ్దుల్ క‌రీం క్వీన్‌కు ఉర్దూ నేర్పేవాడు. ప‌లు భార‌తీయ వంట‌కాల‌ను వండి వ‌డ్డించేవాడు. కొద్ది రోజుల్లోనే క్వీన్ విక్టోరియా సొంతంగా ఉర్దూలో రాయడం, చ‌ద‌వ‌డం నేర్చుకుంద‌ట‌.

అయితే ఆ స‌మ‌యంలోనే క్వీన్ ఓ డైరీని మెయింటెయిన్ చేసింద‌ట‌. దాంతోపాటు అబ్దుల్ క‌రీం గురించి ప‌లు విష‌యాల‌ను లెట‌ర్ల‌లో రాసింద‌ట‌. కాగా క్వీన్ విక్టోరియా 1901లో చ‌నిపోయింది. అనంత‌రం ఆమె స‌ర్వెంట్ల‌ను వారి వారి ఇండ్ల‌కు పంపేశారు. దీంతో అబ్దుల్ క‌రీం కూడా ఇండియాకు వ‌చ్చాడు. అయితే అబ్దుల్ క‌రీం గురించి క్వీన్ రాసిన డైరీ, ప‌లు ఉత్త‌రాల‌ను క్వీన్ కొడుకు కింగ్ ఎడ్వ‌ర్డ్ VII నాశ‌నం చేశాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అన్యోన్య బంధం గురించిన అనేక విష‌యాలు బ‌యటి ప్రపంచానికి తెలియ‌కుండా పోయాయి. అనంత‌రం 1909వ సంవ‌త్స‌రంలో త‌న 46వ యేట అబ్దుల్ క‌రీం చ‌నిపోయాడు. అప్ప‌టికి అత‌నికి ఇద్ద‌రు భార్య‌లు ఉండేవారు. కాగా విక్టోరియా, అబ్దుల్ క‌రీం గురించి శ్రాబ‌నిబ‌సు ఓ పుస్త‌కం రాశారు. ఆ పుస్త‌కం పేరు విక్టోరియా అండ్ అబ్దుల్‌. దాని వ‌ల్ల‌నే పైన చెప్పిన కొన్ని విష‌యాలు అంద‌రికీ తెలిశాయి. ఈ క్ర‌మంలోనే ఆ పుస్త‌కం పేరిటే ఓ సినిమాను తీయ‌గా, అది ఈ మ‌ధ్యే విడుద‌లైంది. కావాలంటే మీరు ఆ సినిమా చూస్తే విక్టోరియా, అబ్దుల్ క‌రీంల‌కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకోచ్చు..!

Comments

comments

Share this post

scroll to top