హై డ్రామా: సైలెంట్ గా ఉన్న పూరి..విచారణకు “లాయర్” తో ఎందుకొచ్చాడు? వాట్సాప్ మెసేజులు, పక్కా ఆధారాలున్నాయంట?

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ దందా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మొట్టమొదటి విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన పూరీని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, ఆయన అభిమానులు ఎక్సైజ్ కార్యాలయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడే ఉన్న మీడియాతో అభిమానులు మాట్లాడుతూ, ఈ కేసులో పూరీ జగన్నాథ్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పూరీ జగన్నాథ్, తన కుమారుడు ఆకాశ్, సోదరుడు సాయిరాంతో కలిసి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పూరీ బెదరకుండా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. కెల్విన్‌ను ఎప్పుడు, ఎలా కలిశావంటూ అడిగిన ప్రశ్నకు తాను ఓ పార్టీ సందర్భంగా కలిశాను తప్పా, అతడితో నాకు రెగ్యులర్‌గా ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారట.

పూరీని అడగలనుకున్న ప్రశ్నలు ఇవేనట!

1. కెల్విన్‌ ఎలా పరిచయం అయింది?
2. పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట.. ఎందుకు?
3. కెల్విన్‌, జిషన్‌లు మీ ఇంటికి ఎందుకు వచ్చారు?
4. ఎంతకాలంగా రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నారు?
5. కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు?
6. నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు?
7. కెల్విన్‌ కంటే ముందు మీకు డ్రగ్స్‌ ఎవరు, ఎలా సరఫరా చేసేవారు?
8. ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవి తేజ, సుబ్బరాజులకు.. డ్రగ్స్‌, కొకైన్‌ మీ నుంచే వెళ్లిన మాట నిజమా, కాదా?
9. డ్రగ్స్‌ తీసుకున్నాక కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్‌లో ఉండరు?
10. బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా, మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి?

watch video here:

అయితే కేసు మొదటినుండి ఏమాత్రం స్పందించని పూరి జగన్నాధ్…బాగా ప్రిపేర్ అయ్యి లాయర్ తో హాజరయ్యారు. ఎలాంటి పరిస్థితిని అయినా పేస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయ్. అరెస్ట్ చేసే అవకాశమైతే లేదనే అంటున్నారు. అయితే డ్రగ్స్ వాడారు? లేక అమ్మరా? అనే కోణం లో విచారణ జరుగుంతుంది. వాట్సాప్ మెసేజీలు, లొకేషన్లు, ఇలా స్క్రీన్ షాట్స్ తో పక్కా ఆధారాలుంన్నాయంట!

ఈ సందర్భంగా పూరీ సోదరుడు సాయిరాం శంకర్ నానా హంగామా సృష్టించాడు. పలువురి రిపోర్టర్ల సెల్‌ఫోన్లు లాక్కుని, వాటిలోని వీడియోలను డిలీజ్ చేశాడు. రహస్యంగా జరుగుతున్న విచారణ గురించి అందరికీ ఎందుకు తెలియజేస్తారంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Comments

comments

Share this post

scroll to top