3 గంటల్లోనే డ్రగ్స్ కేసులో “నందు” విచారణ పూర్తి..! కీలక విషయాలు భయటపెట్టారంట..? అడిగిన ప్రశ్నలు – వాటి సమాధానాలు ఇవేనా?

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు అలియాస్‌ ఆనంద కృష్ణను సిట్‌ అధికారులు ఈ రోజు విచారణకు పిలిచారు. కేవలం మూడు గంటల్లోనే నందు విచారణ పూర్తయింది. సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నందు సమాధానమిచ్చారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేస్తూ వచ్చారు.

ముఖ్యంగా నటుడు నవదీప్, తరుణ్ పబ్‌ల విషయంలో నందును సిట్ బృందం ప్రశ్నించింది. అలాగే ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో గల సంబంధాల గురించి సిట్ ప్రశ్నించింది. కెల్విన్ కాల్ లిస్టులో నందు పేరు ఉండటంతో ఆ కోణంలో సిట్ ప్రశ్నించింది. అసలు కెల్విన్ ఏవిధంగా పరిచయమయ్యాడు..? ఎక్కడ పరిచయమయ్యాడు.?..ఆయనతో ఉన్న సంబంధమేంటి? ఇలా నందుపై సిట్ ప్రశ్నల పరంపర కొనసాగించింది. మొత్తంగా చూస్తే కేవలం మూడు గంటల్లోనే నందు నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నందు వెళ్లిపోయాడు. సిట్ కార్యాలయం నుంచి వెళుతూ. నందుతో పాటు ఆయన తండ్రి సిట్ కార్యాలయానికి వచ్చారు.నందు సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు అక్కడున్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు ఆలయం చుట్టూ ప్రదక్షణలు కూడా చేశాడు.

నందును సిట్ అడిగిన ప్రశ్నలివి అంట..!

సిట్: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటుందా.?
నందు: లేదు.
సిట్:మరి మిమ్మల్ని సిట్ విచారణకు ఎందుకు పిలిచామనుకుంటున్నారు?
నందు: నాకు తెలియదు.
సిట్: నవదీప్ పబ్‌కు మీరు తరచూ వెళ్లేవారు కదా.?
నందు: అవును.
సిట్: నవదీప్ పబ్‌లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయా.?
నందు: నాకు తెలియదు.
సిట్: నవదీప్ డ్రగ్స్ తీసుకుంటారని మీకు తెలుసా.?
నందు: ఎప్పుడూ చూడలేదు.
సిట్: డ్రగ్స్ ముఠాల గురించి మీదగ్గర ఏమైనా సమాచారం ఉందా.?
నందు: నాకు తెలియదు.
సిట్: డ్రగ్స్ మీరు తీసుకోవడమే కాకుండా మీ మిత్రులకు కూడా ఇవ్వడం జరిగిందా.?
నందు: నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటే లేదు.

news source: abnandhrajyothy

Comments

comments

Share this post

scroll to top