డ్రగ్స్ కేసు విచారణలో “ఛార్మి” కి చేదు అనుభవం..! అసభ్యంగా కానిస్టేబుల్ తాకాడని కంప్లైంట్? చివరికి!

డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ఎంత హల్చల్ సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. ఇప్పటికే పూరి జగన్నాధ్, తరుణ్, సుబ్బరాజు..విచారణ ముగిసింది. ఏడో రోజు ఛార్మి విచారణ జరగనుంది.సినీనటి చార్మి విచారణ నిమిత్తం బుధవారం సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు. నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య చార్మీ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పైసా వసూల్ షూటింగ్ నుండి అక్కడికి వెళ్లారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూలు చిత్రానికి చార్మీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇటీవలే పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్‌’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఛార్మిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ విచారణ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే ఆమెను రేపు (గురువారం) కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్‌ ముఠాతో పాటు, సినీ ప్రముఖులతో సంబంధాలపై మహిళా అధికారుల బృందం ఆమెను విచారణ చేయనున్నారు.

ఇది ఇలా ఉంటె..సిట్ అధికారులపై ఛార్మి కంప్లైంట్ ఇచ్చింది. ఆఫీస్ లోకి వస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ తనని పెట్టుకున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. ఆమె రాగానే కానిస్టేబుల్స్ ఆమెను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఛార్మి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అకున్ సబర్వాల్ కు ఈ వార్త తెలియచేసింది ఛార్మి. ఆ కానిస్టేబుల్ పై ఆక్షన్ తీసుకుంటామని ఆయన తెలిపారు. కోర్ట్ ఆదేశాల మేరకు లేడీ ఆఫీసర్లే ఆమెను విచారణ చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top