డ్రగ్స్ కేసు: “సుబ్బరాజు” ను అయిపోయిందని పంపించేసి…మళ్లీ వెనక్కి పిలిచి 12 గంటలు విచారణ? ఆ 15 మంది ఎవరు?

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్ గారి విచారణ ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. కెల్విన్ తో పరిచయాలు లేవని ఆయన చెప్పారు. నిన్న సుబ్బరాజు గారిని అకున్ సబర్వాల్ గారు ఇంటర్రోగేట్ చేసారు. ఉదయం 9.40 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన సుబ్బరాజు విచారణ 10.15 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం తర్వాత 1.30 గంటలకు మళ్లీ రెండో దఫా విచారణ మొదలుపెట్టారు. చివరకు రాత్రి 11.20 గంటలకు సుబ్బరాజు విచారణ ముగించుకుని బయటకు వచ్చారు.  మధ్యలో విచారణ అయిపొయింది వెళ్ళిపోమన్నారు…కానీ అతని సమాదానాలు సంతృప్తిని ఇవ్వకపోవడంతో బయటకి వచ్చిన సుబ్బరాజును మళ్లీ వెనక్కి పిలిచి విచారించారని సమాచారం. దాదాపు పన్నెండు గంటలపాటు విచారణ సాగింది.

విచారణలో సంచలనాత్మక అంశాలను సుబ్బరాజు వెల్లడించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమారులు (ఇద్దరూ ప్రముఖ హీరోలు కూడా), సినీరంగంలో సీనియర్ నటుడిగా ఉన్న మాజీ హీరో కుమార్తె, ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ డ్రగ్స్ వాడుతుంటారని క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు సిట్ అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తున్నది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రమాదకరమైన డ్రగ్స్ ను థాయిలాండ్ నుంచి పెద్ద మొత్తంలో నగరానికి తెప్పించి సినీ పరిశ్రమను మత్తులో ముంచుతున్న విషయాన్ని సుబ్బరాజు చెప్పడంతో ఫిలింనగర్ షేక్ అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top