అలనాటి నటి “కృష్ణకుమారి” కన్నుమూత…110 పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఆమె..!

అలనాటి నటి, హీరోయిన్ కృష్ణకుమారి (83)  చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. 110 పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఆమె.. నవ్వితే నవరత్నాలు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, కాంతరావు, శివాజీ గణేశన్ లాంటి అగ్రహీరోలతో నటించారు కృష్ణకుమారి. దేవాదాసు, బందిపోటు, చిక్కడు దొరకడు లాంటి హిట్ సినిమాలు ఆమెకు పేరుతెచ్చాయి.

కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో 1933, మార్చి 6న  జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు. నవ్వితే నవరత్నాలు సినిమాతో చిత్రప్రవేశం చేసిన ఆమె అగ్ర కథానాయికిగా ఎదిగారు. పిచ్చి పుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, అంతస్తులు, శ్రీకృష్ణావతారం, చిక్కడు దొరకడు, వరకట్నం, బంగారు భూమి, బందిపోటు తదితర సినిమాల్లో నటించారు. కృష్ణకుమారి మృతితో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Comments

comments

Share this post

scroll to top