అక్క‌డ ఓ రోజు గ‌డ‌వాలంటే…బ‌స్తా నిండా డ‌బ్బు కావాలి!?

అత్యంత సంపన్న దేశం..చూస్తుండ‌గానే ద్ర‌వ్యోల్బ‌ణంలో చిక్కుకొని అల్లాడిపోతుంది. ! బ‌స్తా నిండా డ‌బ్బు ఉంటేకానీ ఓ రోజు గ‌డిచే ప‌రిస్థితి లేద‌క్క‌డ‌.! బ్యాంక్ లు ముందు బారులు తీరిన జ‌నం… బ్యాంక్ లో కూడా డ‌బ్బులు లేని వైనం.! ఇలా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది వెనుజులా దేశం…ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంత‌మైన దేశాల స‌ర‌స‌న ఉన్న వెనుజులా ఇప్పుడు త‌మ ఆహార అవ‌స‌రాల‌ను కూడా తీర్చుకోలేని ద‌య‌నీయ స్థితిలో ఉంది.

అపార‌మైన చ‌మురు నిల్వ‌లు, అంద‌మైన ఏంజెల్స్ జ‌ల‌పాతం, ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప‌ర్యాట‌క ఆదాయం…అయినా వెనుజులకు ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చింది…? అంటే పాల‌కుల అనాలోచిత నిర్ణ‌యాలు, ముందుచూపు లేక‌పోవ‌డ‌మే అని చెప్పాలి. ఈ రోజు చేతిలో డ‌బ్బుంది క‌దా అని ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఆడితే…రేపు ఎవ‌రి ప‌రిస్థైనా ఇదేనంటూ వెనుజులా సంక్షోభం మ‌నంద‌రికి ఓ భ‌విష్య‌త్ హెచ్చ‌రిక‌.

20 వ శ‌తాబ్దంలో వెనుజులాలో ఆయిల్ నిక్షేపాల‌ను గుర్తించిన త‌ర్వాత ఆ దేశ అభివృద్ది టాప్ గేర్ కి మారిపోయింది, దీనికి తోడు కాఫీ, కొక‌క‌యా వంటి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కూడా ఆయిల్ తో పాటు విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డంతో ఆర్థికంగా అభివృద్ది చెందింది ఈ దేశం… ఈ క్ర‌మంలో భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకోకుండా…..ఎగుమ‌తుల‌ను పెంచుతూనే పోయింది. దీనికి తోడు ప్ర‌పంచ మార్కెట్ లో చ‌మురు ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గ‌డం వెనుజులాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి.

రివ‌ర్స్ గేర్ :

చేవెజ్ ప్రభుత్వం భవిష్యత్తు అత్యవసరాలకు భద్రపరచకుండా నిధులను ధారాళంగా వ్యయం చేయడం కార‌ణంగా పేదరికం పెరుగుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అనేక సార్లు వెనుజులా క‌రెన్సీ విలువను త‌గ్గించుకుంటూ వ‌చ్చారు. అత్యావసర ఆహారాల కొరత కారణంగా వెనుజులాలో పోషకాహార లోపం పెరిగింది….ఇక నికోలస్ మడురొ అధికారంలోకి వ‌చ్చాక వెనుజులా అభివృద్ది మ‌రింతగా దిగ‌జారింది. ప్ర‌జా సంక్షేమంపై కాకుండా కేవ‌లం త‌న కుర్చీని కాపాడుకునే ధోర‌ణిలోనే మ‌డురో ఆలోచ‌నా విదానం ఉండడం వ‌ల్ల ప్ర‌స్తుతం ఇతంటి ద్ర‌వ్యోల్బ‌ణంలో కూరుకుపోయింది వెనుజులా.

క‌ప్ కాఫీ ధ‌రకు ఒక‌ప్పుడు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వ‌చ్చేది.
వెనుజులాలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ద్ర‌వ్యోల్భ‌ణం ఏ స్థాయిలో ఉందంటే…ఇప్పుడు కాఫీకి ఖ‌ర్చుపెట్టే డ‌బ్బుతో 15 ఏళ్ళ క్రితం ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కోవ‌చ్చ‌ట‌.!!

  • వెనుజులా రాజ‌ధాని- కార‌క‌స్
  • వెనుజులా క‌రెన్సీ-Venezuelan bolívar
  • వెనుజులా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు-నికోలస్ మడురొ

Comments

comments

Share this post

scroll to top