నంద్యాల ఉపఎన్నికల్లో రోజాపై “వేణుమాధవ్” సంచలన వ్యాఖ్యలు..! ఓటు వేయమని చెప్పను..! [VIDEO]

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి తరపున కమెడియన్ వేణుమాధవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం వేణుమాధవ్ నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. ‘రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్నిటీడీపీ అధిష్ఠానంరంగంలో దింపాదనే కామెంట్స్ వస్తున్నాయి?’ అని ప్రశ్నించగా..’ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ’ అని వేణుమాధవ్ జవాబిచ్చారు.

watch video here:

డిగ్రీ పూర్తైన తర్వాత ఎన్టీ రామారావు దగ్గర కొంతకాలం తాను పనిచేసినట్టు చెప్పారు వేణుమాధవ్ .టిడిపి కార్యాలయంలో కూడా పనిచేశానని ఆయన అన్నారు.ఈ కారణంగానే తనకు టీడీపీతో, నందమూరి కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో తనకు కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. ఆ అనుబంధం కారణంగానే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు వేణుమాధవ్ చెప్పారు.

 

Comments

comments

Share this post

scroll to top