మొన్నేమో చెప్పేవన్నీ అబద్ధాలని వెళ్ళిపోయాడు…ఇప్పుడేమో “బాబు గోగినేని” ఎలా తిడుతున్నారో చూడండి!

బాబు గోగినేని ప్రముఖ హేతువాది.. మొన్నీ మధ్య ఒక టివి ఛానెల్లో  పెట్టిన ప్రాణ చికిత్స అనే పేరుతో ఒక ఫోన్ కాల్ లోనే రోగం నయం చేసే అతనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత వేణు అనే ఆస్ట్రాలజిస్ట్  గుట్టు విప్పాడు..తప్పుడు జ్యోతిష్యాలు నమ్మి ప్రజలు ఎలా మోసం పోతున్నారో..లైవ్ లో నే బట్టబయలు చేశాడు..ఇప్పుడు కాలజ్ణానం గురించి జరుగుతున్న చర్చలను తిప్పికొట్టారు బాబు గోగినేని. నాకు జ్యోతిష్యం రాదు నమ్మకండి బాబూ అంటూ దండం పెట్టిన వేణుస్వామి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు..
గతంలో ప్రతి విషయానికి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తి గా నిలిచారు వేణు.సిని,రాజకీయ జ్యోతిష్యుడు అని చెప్పుకోబడే వేణు స్వామి దొంగ జ్యోతిష్యుడిని లైవ్ లో ఉతికి ఆరేశారు బాబు గోగినేని..ఇప్పటివరకూ నేను చెప్పిన వాటిలో నూటికి తొంభైఎనిమిది కరెక్ట్ అయ్యాయంటూ చెప్పుకు తిరిగిన జ్యోతిష్యుడిని నూటికి తొంభై తొమ్మిది తప్పే అంటూ నిరూపించారు.. . ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కూడా తన ప్రచారానికి వేణు స్వామి వాడుకుంటున్నారని ఆరోపించారు.మోడితో దిగిన మార్ఫింగ్ ఫొటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కళ్యాణ్ గుత్తికొండ అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం సేకరించగా…ప్రధాని మోడీతో వేణుస్వామి ఎలాంటి ఫొటో దిగలేదని బయటపడింది.” నేను చెప్పేవి తప్పులు. నన్ను నమ్మకండి. బాబు గోగినేది వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నారు.నాకు జ్యోతిష్యం రాదు. ఆయన చెప్పిందే నమ్మండి.నేను చెప్పేది నిజాలు కాదు” అని అంటూ చర్చ మధ్యలోనే వెళ్లిపోయారు వేణుస్వామి.
 

జ్యోతిష్యుడు..ఎలాంటి సంయమనం లేకుండా లైవ్ లో బరాబర్ మాట్లాడతాం..నేను అలా చెప్పొద్దనడానికి నువ్వెవనివి అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడి లైవ్ నుండి వెళ్లిపోయిన వేణుస్వామి..మళ్లీ మీడియా ముందుకు వచ్చి అదే నోటి దురుసుతో ప్రవర్తించారు..అతని మాటతీరు కూడా ఏమాత్రం అంగీకరమైనదిగా లేదు..తనపై వ్యక్తిగతంగా దాడి చేశారు అనే అతని మాటలు..అతనే బాబు గోగినేనిపై వ్యక్తిగతంగా దాడికి దిగినట్టు ఉన్నాయ్..నిజంగా అతను చెప్పేవి నిజాలైతే..తన జ్యోతిష్యానికి అంత పవరుంటే దాన్ని లైవ్ లోనే యాక్సెప్ట్ చేయాల్సింది..అది చేయకపోగా..లైవ్ నుండి వెళ్లిపోయి మళ్లీ పది రోజుల తర్వాత ఈ విధమైన వ్యాఖ్యలు దేనికి సంకేతమో వేణుస్వామికే తెలియాలి..వేణుస్వామి మాటలు మీరే చూడండి.

watch video here:

https://youtu.be/mmdMA02bQEw

Comments

comments

Share this post

scroll to top