ప్రభుత్వ హెచ్చరిక: మీ మొబైల్ లో ఈ 42 యాప్స్ ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్ చేయండి..! లేదంటే..?

ఉదయం లేచినప్పటి నుండి అర్దరాత్రి వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే..చిన్నా పెద్దా,ముసలి ముతక,పేద ధనిక అనే తేడా లేకుండా ఈ రోజు స్మార్ట్ ఫోన్ తెగవాడేస్తున్నారు.అందులో రకరకాల యాప్స్ యూజ్ చేస్తున్నారు..కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం వాడుతున్న ఈ యాప్స్ వలన సమాచారం తస్కరించబడుతుందని ,దాని వలన ప్రమాదం పొంచి ఉందని మన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.ఇంతకీ ఏ ఏయాప్స్ వలన ఈ ప్రమాదం ఉందో తెలుసుకోండి…

భారత హోంమంత్రిత్వ శాఖ చైనాకు చెందిన 42యాప్స్ ను ప్రమాదకరమైనవిగా గుర్తించింది. ఇందులో మరీ ముఖ్యంగా ట్రూ కాలర్, షేరిట్, యూసీ బ్రౌజర్ వంటివి ఉన్నాయి. భారత సైనికులు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే భారత భద్రతకు ముప్పు వాటిల్లినట్లేనని ఇంటలిజెన్స్ అభిప్రాయపడుతోంది.ఇంటలిజెన్స్ గుర్తించిన 42యాప్స్ ను స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యానికి పారామిలటరీ దళాలకు హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారిక ఫోన్లతో పాటు వ్యక్తిగత ఫోన్లలోను వీటిని వాడొద్దని  స్పష్టం చేసింది.. ఈ యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుందని వార్నింగ్ బెల్ మోగించింది.

ఇంటెలిజెన్స్ హెచ్చరించిన 42యాప్స్ ఇవే :

వీబో, వి చాట్‌ , షేర్‌ఇట్‌ , ట్రూకాలర్‌, యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌, ఎంఐ స్టోర్‌, ఎంఐ వీడియో కాల్‌, ఎంఐ కమ్యూనిటీ , క్లీన్‌మాస్టర్‌, 360 సెక్యూరిటీ, డియు రికార్డర్‌, డియు ప్రైవసీ, డియు బ్రౌజర్‌, డియు క్లీనర్‌, డియు బ్యాటరీ సేవర్‌, వైరస్‌ క్లీనర్‌ పర్‌ఫెక్ట్‌ కార్ప్‌ సీఎం బ్రౌజర్‌, బ్యూటీ ప్లస్‌, న్యూస్‌ డాగ్‌, వివా వీడియో-క్యూయూ వీడియో, యు క్యామ్‌ మేకప్‌, ఫొటో వండర్‌, ప్యారెలల్‌ స్పేస్‌, క్యాచి క్లీనర్‌, వాల్ట్‌హైడ్‌, వండర్‌ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్‌ మాస్టర్‌, వి సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, బైడు ట్రాన్స్‌లేట్‌ , బైడు మ్యాప్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌ , క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్‌, క్యూక్యూ ప్లేయర్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంచర్‌.

Comments

comments

Share this post

scroll to top