Click Here For Guru Review And Rating In English
Movie Title (చిత్రం): గురు (Guru)
Cast & Crew:
- నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు
- సంగీతం: సంతోష్ నారాయణన్
- మాటలు: హర్షవర్థన్
- ఛాయాగ్రహణం: శక్తివేల్
- నిర్మాత: ఎస్.శశికాంత్ (వై నాట్ స్టూడియోస్ )
- రచన, దర్శకత్వం: సుధ కొంగర
Story:
ఆది(వెంకటేష్)కి బాక్సింగ్ అంటే ప్రాణం. కానీ.. కోపం ఎక్కువ. ఆ కోపంతో, బాక్సింగ్ అకాడమీలోని రాజకీయాలు పడలేక తాను అనుకొన్న లక్ష్యాల్ని సాధించలేకపోతాడు. కోచ్‌గానూ ఆదికి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్ కోచ్‌గా నియమిస్తుంది అకాడమీ. అక్కడ రాములు (రితికా సింగ్) కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తుంటుంది రాములు. అక్క లక్స్ (ముంతాజ్) మాత్రం బాక్సర్‌గా రాణించి తద్వారా పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్‌కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. రాములు మాత్రం కేవలం డబ్బు కోసమే కోచింగ్ తీసుకొంటుంది. పైగా ఆదిని చులకనగా చూస్తుంటుంది. ఆదిపై కోపంతో కావాలని మ్యాచ్‌లు ఓడిపోతుంటుంది. అలాంటి పెంకి పిల్లని ఓ ‘గురు’ ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాడు? ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులేంటి? అనేదే ‘గురు’ కథ.
Review:
తెలుగు సినిమాలో ఎలాంటి కమర్షియల్ అంశాలు, వినోదం, ప్రేమ లేకుండా కేవలం క్రీడా నేపథ్యంతో వచ్చిన సినిమా ఇదే. హిందీలో ‘సాలా ఖడూస్’కి ఇది రీమేక్. వెంకటేష్ కోసం కొత్త సన్నివేశాలు ఏం పెట్టలేదు. పైగా హిందీలో కనిపించిన నటీనటులే దాదాపుగా తెలుగులో కూడా కనిపిస్తారు. హీరోయిజం పై ఎక్కువ దృష్టిపెట్టకుండా. వెంకటేష్ కంటే ఎక్కువగా బాక్సింగ్ చుట్టూ సినిమా తిరిగేలా చేసారు. కూరగాయలు అమ్ముకొనే అమ్మాయిని బాక్సింగ్ బరిలో దింపడానికి ‘గురు’ చేసిన ప్రయత్నాలు ఆకట్టుకొంటాయి. విశ్రాంతి ఘట్టం, పతాక సన్నివేశం తప్పకుండా నచ్చేలా తీర్చిదిద్దారు.రీమేక్ సినిమా అయినా ఎమోషన్ ని బాగా కారి చేసారు. స్ఫూర్తి దాయక సన్నివేశాలు, కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. హిందీ సినిమా చూడని వారికి “గురు” తప్పక నచ్చుతుంది .
Plus Points:
- కథా నేపథ్యం
- వెంకటేష్
- రితికాసింగ్
- భావోద్వేగాలు
- బాక్సింగ్ సన్నివేశాలు
- నేపధ్య సంగీతం
Minus Points:
- హిందీ, తమిళ్ లో సినిమా ఎలా ఉందో అలాగే తెలుగులో తీశారు. మార్పులు ఏం చేయలేదు
- సాగదీసే కొన్ని సన్నివేశాలు
Final Verdict:
కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్ గా గురు ఎలా తీర్చిదిద్దాడు అనేదే ఈ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక విభిన్నమైన సినిమా. “వెంకటేష్” లాంటి టాప్ హీరో ఈ రోల్ ఒప్పుకోవడం ఆడియన్స్ ని మెప్పించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పక చూడాలి. హిందీ లో చుసిన వారికి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు!
AP2TG Rating: 3.5/5
Trailer: