ఫ్రెంచ్ నుండి జపనీస్ వరకు 8 భాషలను షేక్ చేస్తున్న వెంకట్… ఏ భాషైనా మూడంటే మూడు నెలల్లోనే నేర్పుతున్న ఎక్స్ పర్ట్.

ఆయన పేరు వెంకట్ పూలబాల. ఆయనను కదిలిస్తే చాలు భాషల ప్రవాహమే. 8 భాషలను గుక్కతిప్పుకోకుండా, గ్రామర్ మిస్టేక్ లేకుండా మాట్లాడగల ఎక్స్ పర్ట్ అతను. ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్, ఇటాలియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ …ఇలా భాష ఏదైనా ఆయా దేశాల ప్రజలు ఎలాగైతే  మాట్లాడుతారో… అదే యాసతో మాట్లడగల నేర్పరి అతను. విదేశీ భాషలను నేర్చుకోవాలన్న తపనతో వెంకట్ కఠోరశ్రమ చేశారు. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 8 భాషాల్లో పూర్తి పట్టు సాధించారు. అంతేకాదు విభిన్న విదేశీ భాషలను నేరక్చుకోవాలనుకునే వారికి అన్నీ తానై… మూడు నెలల్లో వారు కోరిన భాషను పూర్తి స్థాయిలో నేర్పిస్తున్నారు. ఈజీ ఫారెన్ లాంగ్వేజెస్ సంస్థ ను స్థాపించి విదేశాలకు వెళ్లేవారికి కావాల్సిన లాంగ్వేజ్ ను నేర్పిస్తూ ఫారెన్ కంట్రీస్ లో వారి జీవితం సక్సెస్ అవ్వడానికి ప్రత్యక్షంగా సహాయపడుతున్నారు.

దేశవిదేశాల నుండి ఎందరో భాషాభిమానం ఉన్న వ్యక్తులు డైరెక్ట్ గా లగేజ్ తో వెంకట్ ఇంట్లో దిగిపోతారు. మూడంటే మూడు నెలలు వెంకట్ తో కలిసి వారికి కావాల్సిన భాషను నేర్చుకొని వెళతారు. ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీ, జపాన్ ల్లాంటి దేశాలలో లాంగ్వేజ్ ట్రాన్సలేటర్స్ గా జాబ్స్ చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది వెంకట్ శిష్యులే.!

ఇతను నేర్పించే పద్దతే ప్రత్యేకం:
గంటల తరబడి క్లాస్ లుండవ్, అదే పనిగా బోర్డు మీద రాతలూ ఉండవ్… వాక్యానికి వాక్యం బట్టీ పట్టించే పద్దతీ ఉండదు. అంతా ఓ ఢిఫరెంట్ స్టైల్లో సాగుతుంది ఆయన టీచింగ్. నిత్యం మనం చేసే పనులను, మన అవసరాలను నేర్చుకోవాల్సిన భాషకు జోడించి ప్రాక్టికల్ గా కొత్త లాంగ్వేజ్ ను సింపుల్ గా నేర్పించేస్తారు. ఏదో నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్ లేకుండా…ఓ ఆటను ఆడుతున్నట్టు కొత్త భాషను మనలోకి చొప్పించి, మనచేతే మాట్లాడించేస్తారు. నేర్చుకునే భాష యొక్క గొప్పతనాన్ని, ఆ భాష రసాస్వాదనను తెలుపుతూ అభ్యర్థికి సదరు భాషపట్ల గౌరవం పెంపొందేలా చేస్తారు. ఎందుకంటే ఇతర భాషల పట్ల గౌరవభావం ఉన్నవాడే ఆ భాషను నేర్చుకోడానికి ఇష్టపడతాడు అనేది ఆయన వాదం.ఇదే నిజం కూడానూ.!

12208337_834587709996507_11842704799368134_n

ఇతర భాషలను నేర్చుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి?
ఇప్పుడంతా పోటీ ప్రపంచం… ఇతరులతో పోల్చితే నువ్వు ఎందుకు భిన్నం అని తెలిస్తేనే నీకు అవకాశాలు దక్కుతాయి. అందుకే అందరికంటే నీకు ఓ భాష ఎక్కువ వచ్చి ఉంటే మంచిది. ఓ కొత్త భాష నేర్చుకున్నావంటే…నువ్వు సదరు దేశంలోని పరిస్థితుల మీద, అక్కడి విషయాల మీద ఓ అవగాహనను కల్గిఉన్నావని అర్థం. దానికితోడు ప్రస్తుత కాలంలో గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమంతా ఒక్కటవుతున్న సమయాన ఇతర భాషల మీద పట్టుఉంటే( అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాల) అది మన కెరీర్ కు ఎంతగానో తోడ్పడుతుంది అంటారు వెంకట్ పూలబాల.

కొత్త భాషలు నేర్చుకోవాలనుకున్నా, విభిన్న భాషలు నేర్చుకునే వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నయో తెల్సుకోడానికి మీరే డైరెక్ట్ గా వెంకట్ పూలబాల గారిని సంప్రదించొచ్చు…

వెంకట్ పూలబాల ఫేస్ బుక్ ID: CLICK.

13957580_1071992319505219_698052318_n

Comments

comments

Share this post

scroll to top