కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు…మాటల్లో మంచి,మంచి పంచ్ లు విసురుతుంటారు. సమయానుసంధర్భంగా మాట్లాడడంలోనూ…. వ్యంగ్యంగా చురకలంటించడంలోనూ…. సీరియస్ గా మాట్లాడుతూ మద్యలో జోక్స్ వేసి అందర్నీ నవ్వించడంలోనూ ఆయన ముందుంటారు. మంచి మాటకారి. అలాంటి మంత్రిగారు చేసిన ఓ కామెంట్ పై ఇప్పుడు సోషల్ మీడియా చర్చ స్టార్ట్ చేసింది. భారతదేశ సాంప్రదాయ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ సమంత చీర కట్టును ఇందులోకి లాగారు కేంద్రమంత్రిగారు.
కృష్ణాజిల్లా చల్లపల్లిలో జరిగిన స్వఛ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ….సమంత చీర కడితే ఆశ్చర్యం లేదు..మన సమంత అప్పుడు డప్పుడు ఆ డ్రెస్ లు, ఈ డ్రెస్ లు కూడా వేసుకుంటుంది.కానీ బ్రిటన్ ప్రధాని డేవిట్ కామెరూన్ భార్య సమంత చీర కట్టింది…అది భారతదేశ గొప్పతనానికి నిదర్శనం అన్నారు. చెప్పాలనుకుంటే సూటిగా ఆమె గురించి చెప్పొచ్చు..మద్యలో సమంత చీర, ఆ డ్రెస్, ఈ డ్రెస్ అని హీరోయిన్ సమంత ప్రస్తావన తేవడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.