మీటర్ల చొప్పున జుట్టు అమ్మి, కుటుంబ ఆకలి తీరుస్తున్న వెనిజులా మహిళలు.!

వెనిజులా.. స‌హ‌జ సంప‌ద‌కు పెట్టింది పేరు. పెట్రోలియం ప‌రిశ్ర‌మ‌ల‌కు కొదువ లేదు. కానీ తాజా అర్థిక సంక్షోభం వెనిజులాను అతలాకుతలం చేస్తున్నాయి. అక్క‌డి ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే…ఆకలికి తట్టుకోలేక, సరుకులు కొనే డబ్బులు లేక, పనిదొరక్క, మ‌హిళ‌లు త‌మ త‌ల వెంట్రుక‌లు అమ్ముకుని పొట్ట నింపుకుంటున్నారు. 18 ఏళ్ల అమ్మాయిల నుండి మొద‌లు 60 ఏళ్ల ముస‌లి వారి వ‌ర‌కు స్త్రీలు న‌డిరోడ్ల మీదకు వ‌చ్చి త‌మ వెంట్రుక‌ల‌ను అమ్ముకుంటున్నారు.

ఇంకొన్ని ప్రాంతాల్లో  ప‌రిస్థితి మరీ దయనీయంగా ఉంది.  కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు వీధుల్లోకి వ‌చ్చి అమ్మాయిల వెంట్రుక‌లును మీట‌ర్ల చొప్పున కొనుక్కు వెళుతున్నారు. ఇదే అద‌నుగా భావించిన కొన్ని ముఠాలు బ‌య‌ట అమ్మాయి క‌న‌బ‌డితే చాలు వాళ్ల‌ని లాక్కెల్లి వెంట్రుక‌లు పూర్తిగా క‌త్తిరించి పంపిస్తున్నారంట‌. వెనిజులాలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ప‌రిస్థితి మ‌రి దారుణంగా ఉంది.

dailymotion_x502awn

694940094001_5096920643001_ed401d74-a0cb-45c1-9c8a-1fcab51808f5

ఇక ఆక‌లిని త‌ట్టుకోలేని కొంద‌రు అక్క‌డి బేక‌రీలు..హోట‌ళ్ల పై దాడులు చేస్తున్నారు. అర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేయడంలో…. అక్క‌డి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. ప్రభుత్వం ట్రక్కుల్లో సరఫరా చేస్తున్న  ఆహారం ఏ మాత్రం సరిపోకపోవడంతో…పరిస్థితి మరీ చేయిదాటినట్టైంది. దీని కారణంగా….వెనిజులా లోని ప్రతి కుటుబం.. ఆ కుటుంబ స్త్రీ జుట్టు మీద ఆధారపడినట్టైంది.

Comments

comments

Share this post

scroll to top