విచారణ విడుదల.

ఓటు కు నోటు కేసులో  ఏసిబి అధికారులు   టిడిపి నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ని  విచారించారు.నిన్న సాయంత్రం ఈ కేసుకు సంబంధించి సండ్ర వెంకట వీరయ్యకు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఏసిబి అధికారులు నేడు వేం నరేందర్ రెడ్డిని  విచారించారు.

vem narender reddy arrest

 

అయితే ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిని అరెస్ట చేస్తారనే పుకార్లు షికార్లు చేశాయి కానీ సుధీర్ఘ విచారణ తర్వాత వేం నరేందర్ రెడ్డిని విడుదల చేశారు. ఈ కేసు విషయంలో ఈ రోజే ప్రధాన సాక్షి స్టీఫెన్ సన్ తన వాగ్మూలాన్ని నాంపల్లి కోర్టులో ఏసిబి కోర్టు కు  ఇచ్చారు. దీనిని  అధికారులు రికార్డ్  చేసుకున్నారు. మరో వైపు ఏ నిమిషం లో అయినా చంద్రబాబు కు కూడా నోటీసులు అందే అవకాశం ఉందన్న సమాచారం తో  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top