ఇక ప్ర‌తి శ‌నివారం విద్యార్థుల‌ మ‌ధ్యాహ్న భోజ‌నంలో ….బిర్యానీ.!!!

ఇప్ప‌టి నుండి ప్ర‌తి శ‌నివారం విద్యార్థుల మ‌ధ్యాహ్న భోజ‌నంలో వెజ్ బిర్యానీ వ‌డ్డించ‌నున్నారు. కేంద్ర బృంద సూచ‌న‌ల‌మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. వెంట‌నే కొత్త మెనూ ను పాఠ‌శాల‌ గోడ‌ల‌పై క‌ల‌ర్స్ లో రాయించాల‌ని MEO ల‌కు ఆదేశాలు జారీ చేశారు పాఠ‌శాల‌ విద్యాశాఖ అధికారులు. బిర్యానీ అంటే పిల్ల‌లు ఇష్టంగా తింటార‌ని..దానికి తోడు పోష‌కాలు సంమృద్దిగా ఉండే ప‌చ్చి బ‌ఠానీలు, మేల్ మేక‌ర్స్ , సోయా చిక్కుళ్ళు ఈ బిర్యానీల‌లో వాడ‌డం వ‌ల్ల పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కావాల్సిన ప్రొటీన్స్ ఎక్కువ‌గా ల‌భించే అవ‌కాశం ఉటుంద‌నే ఉద్దేశ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని వినియోగించుకుంటున్న 24 ల‌క్ష‌ల మంది విద్యార్థుల్లో దాదాపు 8 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఉద‌యం టిఫిన్ చేయ‌కుండానే స్కూల్స్ కు వ‌స్తున్న‌ట్టు అంచ‌నా.! ఈ నేప‌థ్యంలో దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవ‌స‌ర‌ముంది. దీనికి సంబంధించి స్కూల్ టీచ‌ర్స్ …విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో అల్పాహారం యొక్క ప్రాముఖ్య‌త‌ను స‌వివ‌రంగా చెప్పాల్సి ఉంది. శారీర‌కంగా బ‌లంగా ఉంటేనే…మాన‌సికంగా కూడా బ‌లంగా ఉంటారు కాబ‌ట్టి…. విద్యార్థుల‌కు పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంతో పాటు త‌ల్లిదండ్రుల మీద కూడా ఉంది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top