అప్ప‌టి వ‌ర‌కు చ‌లాకీగా ఉన్న కుర్రాడు ఒక్క‌సారిగా ఇలా….!? సోష‌ల్ మీడియా మ‌రోమారు స్పందించాల్సిన స‌మ‌య‌మిది.!!

చ‌లాకీ కుర్రాడు…ఊరికి నాలుక లాంటి వాడు… వ‌రుసలు పెట్టి ఊర్లో వాళ్ళంద‌ర్నీ ఆప్యాయ‌త‌గా ప‌ల‌క‌రిస్తూ …ఆడుతూ పాడుతూ చ‌దువుకునే కుర్రాడి విషాద‌గాథ ఇది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గోపాల‌పురానికి చెందినవీర‌నాగ‌రాజు ది పేద కుటుంబం..రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి…అయితేనేం చ‌దువు మీద ఉన్న ఇంట్ర‌స్ట్ కార‌ణంగా హాలిడేస్ లో ఏదో ఒక ప‌ని చేసుకుంటూ త‌న చ‌దువుకు కావాల్సిన ఖ‌ర్చును తానే స్వ‌యంగా సంపాదించుకునే వాడు… అంతో ఇంతో మిగిల్చి ఇంట్లో ఖ‌ర్చుల‌కు కూడా ఇచ్చేవాడు.

కానీ విధి వ‌క్రీరక‌రించింది. ఎప్ప‌టిలాగే సెల‌వు రోజుల్లో పెయింటింగ్ ప‌నికి వెళ్ళిన వీర‌నాగ‌రాజు మూడంస్తుల బిల్డింగ్ నుండి జారి ఆ కింద‌నే ఉన్న హైటెంక్ష‌న్ వైర్స్ మీద ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఎడ‌మ‌కాలు, ఎడ‌మ చేయితో పాటు ఎడ‌మ చెవిని కూడా కోల్పోయాడు. చ‌చ్చిపోతాడ‌నుకున్న కుర్రాడిని బ‌తికించుకోవ‌డం కోసం ఆ పేద త‌ల్లిదండ్రులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కొడుకు వైద్యం కోసం సొంతింటిని అమ్మేశారు, అందిన‌కాడికి అప్పులు తెచ్చారు. మొత్తం 9 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చు చేశారు. చావు నుండి బ‌య‌ట‌ప‌డ్డ వీర‌నాగ‌రాజు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే క‌రెంట్ షాక్ వ‌ల్ల కాలిపోయిన అత‌ని కాలుకు మ‌రోసారి ఇన్ఫెక్ష‌న్ సోకింది. అది మెల్లిగా మెల్లిగా మ‌ళ్ళీ అత‌డి ప్రాణాలకే ప్ర‌మాదంగా మారింది, మ‌రో స‌ర్జ‌రీ చేస్తే నాగ‌రాజు ఈ క్లిష్ట ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డ‌తాడు.! కానీ ఇప్ప‌టికే ఇంటిని అమ్ముకున్న త‌ల్లిదండ్రుల‌కు ఆ స‌ర్జ‌రీ చేయించే స్తోమ‌త లేదు. కాబ‌ట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా దాత‌లెవ‌రైనా ముందుకు వ‌చ్చి…నాగ‌రాజును ఆదుకోవాల‌ని విన‌తి.

నాగ‌రాజు ఫోన్ నెంబ‌ర్… 7288037386

Comments

comments

Share this post

scroll to top