వీణా-వాణీలకు ఆపరేషన్ అసాధ్యం.

అవిభక్త కవలలైన వీణా-వాణీలకు ఆపరేషన్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు ఎయిమ్స్ వైద్యులు. 2003 లో  వరంగల్ జిల్లాకు చెందిన మురళి-నాగలక్ష్మీ దంపతులకు పుట్టిన కవలలే ఈ  వీణా-వాణీలు. అయితే జన్మతహా…వీరి తలలు అతుక్కొని ఉన్నాయి. వాటిని వేరు చేయడం కోసం అనేక హాస్పిటల్స్ కు తిరిగారు తల్లిదండ్రులు .చివరకు హైద్రాబాద్ లోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రి లో చేర్పించారు. వీరి ప్రతి పుట్టిన  రోజున ….వీరి మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉండేది……టివీల్లో కూడా వీణా-వాణీల ఆపరేషన్ మీద చర్చే.

అయితే వీణా-వాణిల ఆపరేషన్ సాద్యమేనంటూ..సింగపూర్ మరియు లండన్ నుండి వైద్యులు నిలోఫర్ హాస్పిటల్ కు వచ్చారు. సింగపూర్ వైద్యులు చేతులెత్తేస్తే….లండన్ వైద్యులు  మాత్రం..ఆపరేషన్ చేయొచ్చు కానీ దానికి 10 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది…20 శాతం మాత్రమే గ్యారెంటీ ఉంది. దానికి ఓకే అంటే మేము ఆపరేషన్ కు ముందుకొస్తామని తెలిపారు.

article-2088579-0F844C9400000578-706_634x431

దీనికి మనవాళ్లు అంగీకరించకపోవడంతో అప్పటి నుండి వీణా-వాణీలకు నిలోఫర్ లో ఓ ప్రత్యేక గదిని ఇచ్చి…వారి బాగోగులు చూసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది . అయితే తాజాగా వీరి ఆపరేషన్ అసాధ్యమని…ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు . దీంతో  వీణా వాణీల పోషణ బాధ్యత తల్లిదండ్రులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు ఆసుపత్రి అధికారులు . పిల్లల భవిష్యత్ కోసం  …ఒకేసారి కొంత మొత్తంలో వారి పేరెంట్స్ డబ్బును అందివ్వడంతో పాటు….. నెలకు కొంత డబ్బును పించన్ రూపంలో ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

article-2098807-11A752FE000005DC-411_634x386

చదువుల్లో రాణిస్తున్న వీణా -వాణీలు:

ప్రస్తుతం 5 వ తరగతి చదువుతున్న వీణా-వాణీలు…చదువుల్లోనూ మంచి మార్కులను పొందుతున్నారు. వీరికి ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో పుస్తకాలతో పాటు..టివిని చూస్తూ విజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. డిస్కవరీ…ఎనిమల్ ప్లానెట్ ల్లాంటి ఛానెల్స్ తో పాటు BBC న్యూస్ ను కూడా చూస్తున్నారట.

వీణా-వాణీల భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షిద్దాం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top