ఆ హీరో ఇలాంటి వివాదాలకు కెరాఫ్ అడ్రస్…. మొన్న అంతర్జాతీయ యోగాడే రోజు తాగొచ్చి వింతవింత ఆసనాలు చేసిన ఆ హీరోగారే…ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన MLA ను అందరి ముందే కొట్టాడు. పూర్తి వివరాల్లోకి వస్తే……తమిళనాడు ను వర్షాలు ముంచెత్తుతున్నాయ్. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శించే కార్యక్రమాన్ని చేపట్టారు DMDK అధినేత హీరో విజయ్ కాంత్…దీనిలో భాగంగానే ఆయన ప్రసంగించడం స్టార్ట్ చేశారు. ప్రసంగంలో స్థానిక నేతల పేర్లను తప్పుగా పలుకుతున్నారు. దీంతో పక్కనే ఉన్న ఆయన పార్టికే చెందిన MLA ఆ పేర్లను గుర్తుచేస్తూ ఉన్నారు.
తన ప్రసంగానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో సహనం కోల్పోయి అందరి ముందే ఆ MLA ను తల మీద వీపు మీద కొట్టాడు విజయ్ కాంత్.. ఆయన హీరోనే కావొచ్చు, ఓ పార్టీకి అధినేతే కావొచ్చు కానీ ప్రజల ముందే ప్రజాప్రతినిధిపై చేయి వేసుకోవడం ఏ మాత్రంనాయకుడి లక్షణం అనిపించుకోదు.
Watch Video: