హిట్లతో దూసుకెళ్తున్న “వరుణ్ తేజ్” కి “తొలిప్రేమ” బ్రేక్ ఇచ్చిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Krishna

Movie Title (చిత్రం): తొలిప్రేమ (Tholiprema)

Cast & Crew:

  • నటీనటులు: వరుణ్ తేజ్, రాశీఖన్నా, ప్రియదర్శి, సుహాసిని తదితరులు
  • సంగీతం: యస్.యస్. థమన్
  • నిర్మాత: బి వి యస్ యన్ ప్రసాద్
  • దర్శకత్వం: వెంకీ అట్లూరి

Story:

ఆదిత్య (వరుణ్ తేజ్‌) కాలేజ్ టాప‌ర్‌.. తాను క‌రెక్ట్‌గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓ ట్రెయిన్ జ‌ర్నీలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తన ప్రేమ‌ను ఆమెకు దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే కంపెనీలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే క‌థ‌.

Review:

ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. జబర్దస్త్ హైపర్ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చూపించాడు

Plus Points:

న‌టీనటులు
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం, నేప‌థ్య సంగీతం
ఫ‌స్టాఫ్‌

Minus Points:

సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేదు
కామెడీ పెద్ద‌గా లేక‌పోవ‌డం
క్లైమాక్స్‌

Final Verdict:

రెండు భిన్న వ్య‌క్తిత్వాల ప్ర‌యాణం.. ‘తొలిప్రేమ‌’

AP2TG Rating: 2.75 / 5

Trailer:

Comments

comments