IPL వేలం లో ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన వరుణ్ చక్రవర్తి గురుంచి మీకు తెలియని కొన్ని నిజాలు.!

pandu

వరుణ్ చక్రవర్తి వయసు ఇప్పుడు 27 ఏళ్ళు, ఈ ఏడాది జరిగిన IPL వేలం లో అతని బేస్ ధర 20 లక్షలు కాగా, 8 కోట్ల 40 లక్షల రూపాయలకు అతన్ని పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అతన్ని అంత భారీ ధరకి దక్కించుకున్న వెంటనే, దేశ వ్యాప్తంగా ప్రజలు అతనెవరు అనేది తెలుసుకొనడం మొదలుపెట్టారు. తమిళ్ నాడు రాష్ట్రానికి చెందిన వరుణ్ చక్రవర్తి ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు.

ఆర్కిటెక్చర్‌లో లో జాయిన్ కాకముందు వరుణ్ చక్రవర్తి వికెట్ కీపర్ బ్యాట్సమెన్ గా శిక్షణ పొందాడు, 17 ఏళ్ల వయసు వరకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ వికెట్ కీపర్ విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో అతను ఆటకు గుడ్ బై చెప్పి ఆర్కిటెక్చర్‌లో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత కొన్నాళ్ళకి మళ్ళీ మనసు క్రికెట్ వైపు మళ్లింది వరుణ్ చక్రవర్తి కి. క్రోమ్‌బెస్ట్‌ క్రికెట్‌ క్లబ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా చేరాడు, కానీ మోకాలి గాయం తో వరుణ్ ఫాస్ట్ బౌలర్ గా కొనసాగించలేకపోయాడు, తరువాత స్పిన్ బౌలింగ్ విభాగాన్ని ఎంచుకొని, అందులో ఆరి తేరాడు వరుణ్ చక్రవర్తి.

తమిళ్ నాడు క్రికెట్ లీగ్ అతని దశ దిశలను.

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)తో తన సత్తా నిరూపించుకున్నాడు వరుణ్ చక్రవర్తి, రెండేళ్లుగా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని సీచెమ్‌ మధురై పాంథర్స్‌ను ఈ ఏడాది విజేతగా నిలపడం లో అతని పాత్ర ఎంతో ఉంది, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ లో సత్తా చాటడం తో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఛాన్స్‌ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్‌లాడి లీగ్‌ దశలో అత్యధిక వికెట్లు (22) తీసిన బౌలర్‌గా నిలిచాడు.

కోలకతా టూ ముంబై టూ పంజాబ్ :

ఐపీఎల్‌–11 సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నెట్స్‌లో బౌలింగ్‌ వేసేవాడు వరుణ్ చక్రవర్తి. స్థానిక వివాదం కారణంగా సీఎస్‌కే పుణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా, మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్, జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్‌ల పిలుపుమేరకు కోలకతా జట్టు నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు వరుణ్ చక్రవర్తి. కానీ ఏమైందో వాళ్లు రిలీజ్‌ చేయడంతో వేలానికి వచ్చాడు.

వేలం పాటలో జాక్ పాట్ :

IPL వేలం పాటలో RS 8.40 CR కు అమ్ముడుపోతాడని కల్లో కూడా అనుకోని ఉండడు వరుణ్ చక్రవర్తి. అతని కష్టానికి అదృష్టం తోడవడం తో లక్ష్మీదేవి కటాక్షం కలిగింది వరుణ్ చక్రవర్తి కి.

 

Comments

comments