వరుడు తాళి కట్టగానే..వధువుకి లవర్ కనిపించదు..! అతనితో జంప్ అయ్యింది, కానీ పెళ్ళికొడుకు వెరైటీగా..

సినిమాల్లో పెళ్లి సీన్ వచ్చే సమయంలో “ఆపండి” అనే డైలాగ్ వినడం రొటీన్. కానీ రియల్ లైఫ్ లో తాళికట్టిన తరవాత వధువుకి తన లవర్ కనిపించడం వెరైటీ, అతనితో జంప్ అవ్వడం మరో వెరైటీ. ఈ వింత సంఘటన కేరళలో చోటుచేసుకుంది.  తనకు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంగా మూడు ముళ్లు పడిన కొద్దిసేపటికే వరుడికి షాకిచ్చింది. కల్యాణ మండపంలో తన ప్రియుడు కనిపించగానే అతడితో కలిసి వెళ్లిపోయింది. కేరళలోని త్రిశూరు జిల్లాలో ముల్లస్సెరీకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువాయూర్ లోని శ్రీకృష్ణుడి ఆలయ కల్యాణ మండపం వివాహ వేదికైంది. గత ఆదివారం (జూలై 31న) వధూవరుల బంధువులతో అంతా సవ్యంగానే సాగిపోతోంది.

మూహూర్త సమయానికి వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. అంతలోనే వధువుకు కల్యాణ మండపంలో తన ప్రియుడు కనిపించాడు. లవర్ తో కలిసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇలా జరగడంతో వరుడు బంధువులు గొడవకి దిగారు. పరువు పోయిందని, కేసు పెడతామని భయపెట్టారు. పరువుగల కుటుంబం.. నష్టపరిహారం చెల్లిస్తామని వధువు కుటుంభం అనగానే వరుడు కుటుంభం కూల్ అయ్యారు. రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వరుడి బంధువులు డిమాండ్ చేశారు. చివరికి రూ.8 లక్షలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. కట్నం, లాంఛనాలతోపాటు.. అదనంగా మరో 8లక్షల రూపాయలు వరుడికి వచ్చాయి. దీంతో వరుడు ఫుల్ ఖుషీ అయ్యాడు. పోతేపోయింది.. లక్షలకు లక్షలు డబ్బులు వచ్చాయి అని కేక్ కట్ చేసి మరీ పండగ చేసుకున్నాడు. ఈ వ్యవహారం కేరళలో పెద్ద సంచలనం అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

 

Comments

comments

Share this post

scroll to top