లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం లోని ‘ఎందుకు’ పాట పైన ఆవేదన వ్యక్తపరిచిన లక్ష్మి పార్వతి.!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ, ఈ సినిమాలోని పాటలను సమయానికి అనుకూలంగా వదులుతున్నాడు రామ్ గోపాల్ వర్మ, ఇటీవలే ఈ చిత్రం లోని ఎందుకు పాట ను యూట్యూబ్ లో వదిలాడు వర్మ, అయితే ఈ పాటలో లక్ష్మి పార్వతి నే ఎందుకు అనే ప్రశ్న మీదనే మొత్తం తిరుగుతుంది.

లక్ష్మి పార్వతి నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు :

వర్మ తనదైన శైలి లో ఈ పాట తో విరుచుకుపడ్డాడు, అయితే లక్ష్మి పార్వతి గారి మీద మొత్తం వేసి, చివరకు ఇవి నిజాలో కావో అని చెప్పాడు పాటలో, ఇదే విషయం అయి లక్ష్మి పార్వతి మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ పాట విని బాధ పడ్డా చాలా, కానీ చివరకు ఇవన్నీ ప్రశ్నలే అని రామ్ గోపాల్ వర్మ పాటలో పేర్కొన్నారు, ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆయన కష్టాలు కూడా చూపించాలి, రాజకీయాల్లోనే కాదు సినిమాలోకి రాకముందు రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన చాలా కష్టాలు ఎదురుకున్నారు వాటిని చూపియ్యకపోతే బయోపిక్ అని ఎలా అంటారు అని పరోక్షంగా కొందరి పైన విరుచుకుపడ్డారు ఆమె.

వర్మ ఏంది అయ్యా ఇది.. :

అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం లోని పాటలు విన్నాక దాదాపు ప్రతి ఒక్కరు వర్మ ఏంటి ఈ కర్మ అంటున్నారు, రక్త చరిత్ర లాగ కాకపోయినా పర్లేదు కానీ ఆఫీసర్ సినిమా లాగ కాకుంటే చాలు అని అందరూ అనుకుంటున్నారు, కానీ పాటల్లో మాటలకి మ్యూజిక్ కి సంబంధం లేకుండా అడ్డగోలుగా పెట్టేసి ఇవి సినిమా లో పాటలు అంటున్నారు వర్మ, ఎలాగో సినిమాలో చూపిస్తారు గా మళ్ళీ కావాలనే పాటల ద్వారా చెప్పడం ఎందుకు అని చాలా మంది భావన, అయితే ఈ సినిమా కొసం ఎదురు చూసే వారి సంఖ్య భారీగానే ఉంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top