వర్మ జీఎస్‌టీకి ఇద్దరు యువకులు కౌంటర్..! స్పూఫ్ అని చెప్పి ఏం చేసారో చూస్తే నవ్వాపుకోలేరు.!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ జీఎస్‌టీ (గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) ఫిలిం తీయడం ఏమోగానీ దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫిలింను అనుకున్నట్లుగా జనవరి 26వ తేదీన రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయగా ఈ ఫిలింను చూసేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున వీక్షకులు ఎగబడ్డారు. దీంతో సైట్‌ కొంత సేపు పనిచేయలేదు. అయితే వర్మ జీఎస్‌టీ సినిమా పక్కన పెడితే ఇప్పుడు దీనికి కౌంటర్‌ వేసేందుకు కొందరు యువకులు రెడీ అయ్యారు. వారు జెంట్స్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ పేరిట వర్మ గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌కు కౌంటర్‌గా ఫిలిం తీస్తున్నారు. ఇంతకీ అసలు ఈ ఫిలింను తీస్తున్నది ఎవరంటే…

గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌.. ఇండియాలో ఇప్పుడీ ఫిలిం హాట్‌ టాపిక్‌. కొందరు ఈ ఫిలిం తీసినందుకు వర్మను విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం వర్మను పొగుడుతున్నారు. అయితే కొందరు మాత్రం వర్మ జీఎస్‌టీకి కౌంటర్ గా తమదైన శైలిలో మరో జీఎస్‌టీ తీసేందుకు సిద్ధమవుతున్నారు. అదే.. జెంట్స్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ ఫిలిం. ఇక దీనికి దర్శకుడు మన తెలుగువాడే. సూర్య ఆకొండి అని ఉన్నారు. కాగా ఇందులో మియా మాల్కోవాకు బదులుగా మేల్‌ పాలకోవా అని ఓ వ్యక్తి నటిస్తున్నాడు.

ఇక వర్మ జీఎస్‌టీ పోస్టర్‌ను పోలి ఉండేలా జెంట్స్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ పోస్టర్‌ను రూపొందించారు. చూశారుగా.. అచ్చం వర్మ జీఎస్‌టీలాగే పోస్టర్‌ ఉంది కదా. కాకపోతే ఇందులో మియా మాల్కోవాకు బదులుగా ఓ వ్యక్తి ఉన్నాడు. ఇక దర్శకుడి స్థానంలో సూర్య ఆకొండి ఉన్నారు. మిగతాదంతా సేమ్‌ టు సేమ్. మియాకు అడ్డంగా చేయి పెట్టినట్టు ఈ పోస్టర్‌లో కూడా పాలకోవాకు అడ్డంగా చేయి పెట్టారు. చూస్తుంటేనే బాగా నవ్వు తెప్పించేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. అయితే ఇది కేవలం పోస్టర్‌తోనే జీఎస్‌టీకి కౌంటర్‌గా ఆగిపోతుందా, లేక వారు నిజంగానే ఫిలిం తీస్తారా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top