అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ సినిమా ని మళ్ళీ మొదటి నుండి తియ్యనున్నారు. ఎందుకో తెలుసా.?

తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా ని తమిళ్ లో రీమేక్ చేసారు, సెన్సేషనల్ డైరెక్టర్ బాల అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు, ఈ సినిమా కి ‘వర్మ’ అని టైటిల్ ఖరారు చేసారు, ఈ సినిమా లో విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్ర లో స్టార్ హీరో విక్రమ్ కొడుకు ‘ధృవ్’ నటించాడు, ఈ చిత్రం తో ‘ధృవ్’ హీరో గా వెండితెర కు పరిచయం కానున్నాడు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ను సోషల్ మీడియా లో విడుదల చేసారు చిత్ర యూనిట్. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాతలు. కానీ ఈ సినిమా మొదటి కాపీ చుసిన నిర్మాతలు ఈ సినిమాను విడుదల చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నారు.

డైరెక్టర్ వలనే.. :

వర్మ సినిమా లో డైరెక్షన్ సరిగ్గా లేదని ప్రొడ్యూసర్స్ ఏ తెలిపారు, డైరెక్టర్ ని మార్చి సినిమా ని మొదటి నుండి మళ్ళీ షూట్ చేస్తాం అని ప్రొడ్యూసర్స్ తెలిపారు, వర్మ సినిమా లో ధృవ్ చాలా బాగా నటించాడు, అతని పాత్రకు న్యాయం చేసాడు, ధృవ్ తోనే ఈ సినిమాను మళ్ళీ మొదటి నుండి వేరే డైరెక్టర్ తో చిత్రీకరిస్తాం, మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ గురుంచి త్వరలోనే వెల్లడిస్తాం అని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు వర్మ మూవీ ప్రొడ్యూసర్స్.

ఎలాగైనా సాధిస్తాం.. :

తెలుగు లో కల్ట్ సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమా, తమిళ్ లో కూడా వర్మ అదే రేంజ్ కి వెళ్లాలని మా కోరిక, అందుకే ఎన్ని డబ్బులు నష్టపోయినా, ఎంత కష్టం అయినా, కష్టపడి జూన్ నెల కల్లా వర్మ సినిమా ని ముందుకు తీసుకొస్తాం అని ప్రొడ్యూసర్స్ తెలిపారు.

ఇంపాక్ట్ అలాంటిది.. :

అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో బాగా పాపులర్ అయ్యింది, ఆ చిత్రం తరువాత విజయ్ కి యూత్ లో బాగా క్రేజ్ వచ్చింది, ఆ ఎఫెక్ట్ వల్లే నోటా సినిమా ని కూడా ఒప్పుకున్నాడు విజయ్ దేవరకొండ, వర్మ సినిమా అర్జున్ రెడ్డి స్థాయిని అందుకోలేకపోతే సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్ ఎదురుకోవాల్సి వస్తుంది, బడ్జెట్ కూడా పెద్దగా లేకపోడం తో, సినిమా మొత్తం రీషూట్ చెయ్యడం లో తప్పులేదని కొందరు భావిస్తున్నారు, రీషూట్ తరువాత అయినా ఈ సినిమా అర్జున్ రెడ్డి స్థాయిని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. స్టార్ హీరో విక్రమ్ కొడుకు సినిమా కావడం తో మొదటి సినిమా పైన విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని కొందరు అంటుంటే, విక్రమ్ గురించి తెలిసి కూడా విక్రమ్ పైన తప్పుగా మాట్లాడటం ఏంటి అని మరికొందరు అంటున్నారు, ఈ ఇష్యూ పైన విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి, విచిత్రమైన సినిమాలకు మారుపేరు అయిన వెటరన్ డైరెక్టర్ బాల, విక్రమ్ మంచి స్నేహితులు. మరి ఈ విషయం పైన విక్రమ్ రియాక్షన్ కోసం సోషల్ మీడియా అంతా ఎదురుచూస్తుంది.

Comments

comments

Share this post

scroll to top