చిరంజీవికి షష్ఠి పూర్తి వేడుకలు చేయడం నాకిష్టం లేదు..

ఓ పక్క టాలీవుడ్ టాలీవుడ్ అంతా అన్నగారికి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ ఫ్రొఫైల్ ఫిక్స్ మొత్తం చిరు ఫోటో లతో సెట్ చేసుకున్నారు.  ఇన్ని రోజులు అన్నకు దూరంగా ఉన్న తమ్ముడు పవన్ కూడా షూటింగ్ ను పక్కన పెట్టి మరీ అన్న ఇంటికి వచ్చి విష్ చేసి వెళ్లాడు. టివిలేమో లైవ్ కవరేజ్ ఇస్తూ ఫుల్  TRP లు పెంచుకుంటున్నాయ్… కానీ ఈ డైరెక్టర్ వర్మ గారు మాత్రం ఢిఫరెంట్ గా ట్వీట్టర్లో   ఓ పోస్ట్ పెట్టి మా బోటి వాళ్లను అటు తిప్పేసుకున్నాడు.

 

ట్విట్టర్ స్టార్ వర్మ చేసిన ట్వీట్స్ ఏంటో తెలుసా…?

  • ‘చిరంజీవి గారూ.. మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు.  దీని గురించి వీపరితంగా ప్రచారం చేయడం అంతకన్నా నచ్చలేదు. అభిమానులకు మీరు ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే
  • ‘మెగాస్టార్‌ను ఉద్దేశించి కాదు కానీ.. షష్టిపూర్తి అనేది ఓ కుటంబ పెద్దను బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించడానికి సన్నిహితులు ఏర్పాటు చేసే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి చిరంజీవి ఒప్పుకోవడం నన్ను బాధించింది’
  • నేనెప్పుడు ఎవరికి బర్త్ డే విష్ చేయలేదు.. కానీ చిరంజీవి బర్త్ డే  మాకే  సంతోషాన్నిచ్చింది.

 

rgv tweets

అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చేశాడు. ఓ పక్కేమో రామ్ చరణ్ తండ్రి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చూస్తుంటే.. వర్మ గారేమో..  చిరంజీవికి 60 యేళ్లు నిండాయ్ అని ప్రచారం చేసే వాళ్లను హేట్ చేస్తా అంటున్నాడు. రామ్ చరణ్  దేమో బాధ్యత, వర్మ గారి దేమో అభిమానం.  నేను మాత్రం ఓ మాట చెప్పగలను అభిమానం కంటే బాధ్యత గొప్పది.

WATCH: చిరు ఇంటికి వెళ్లి విష్ చేసిన పవన్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top