ఆయా దేశాల్లో డ్ర‌గ్స్ వాడితే…ఎటువంటి శిక్ష‌లు విధిస్తారో తెలుసా???

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మందికి సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేయ‌గా, రోజుకొక‌రి చొప్పున విచార‌ణ కొన‌సాగుతోంది. రోజు రోజుకీ కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. అయితే ఈ తంతు ఎలా ఉన్నా డ్ర‌గ్స్ అమ్మిన‌వారికి, వాటిని కొన్న‌వారికి మ‌న దేశంలో ప‌డే శిక్ష‌లు చాలా త‌క్కువ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే చ‌ట్టాలు అలా ఉన్నాయి మ‌రి. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంతో స‌హా ప‌లు దేశాల్లో డ్ర‌గ్స్‌కు సంబంధించిన నేరాలు చేసిన వారికి ఎలాంటి శిక్ష‌లు వేస్తారంటే…

  • డ్ర‌గ్స్ తీసుకున్న వారికి మ‌న దేశంలో గ‌రిష్టంగా 1 సంవ‌త్స‌రం పాటు జైలు శిక్ష వేస్తారు. లేదా రూ.20వేల జరిమానా వేస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో రెండూ వేయ‌వ‌చ్చు. లేదంటే 6 నెల‌ల జైలు శిక్ష లేదా రూ.10వేల జ‌రిమానా లేదా రెండూ వేయ‌వచ్చు. ఇక పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ అమ్మిన వారికి 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష‌, రూ.1 ల‌క్ష నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా ప‌డ‌వ‌చ్చు. అదే నేరం తీవ్రత త‌క్కువ‌గా ఉంటే 6 నెల‌ల జైలు శిక్ష‌, రూ.10వేల జరిమానా లేదంటే రెండూ ప‌డ‌వ‌చ్చు.
  • సౌదీ అరేబియా లో డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, అమ్మ‌డం, గంజాయి వంటి మొక్క‌లు పెంచ‌డం తీవ్ర‌మైన నేరాలుగా ప‌రిగ‌ణిస్తారు. వాటికి అక్క‌డ బ‌హిరంగ శిర‌చ్ఛేదం అమ‌లు చేస్తారు. స్వ‌ల్ప మోతాదులో డ్ర‌గ్స్ తీసుకుంటే మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి విడిచి పెడ‌తారు.

  • అమెరికాలో అయితే జైలు శిక్ష వేస్తారు.
  • పోర్చుగ‌ల్‌లో డ్ర‌గ్స్ వినియోగం, విక్ర‌యాల‌పై నిషేధం అమ‌లులో ఉంది. అయితే ఎవ‌రైనా డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారితే మాత్రం వారిని ఆ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి ప్ర‌భుత్వ‌మే స‌హ‌క‌రిస్తుంది. 2000వ సంవ‌త్స‌రం నుంచి దీన్ని అమ‌లు చేస్తున్నారు.
  • చైనాలో డ్ర‌గ్స్‌పై నిషేధం ఉంది. డ్ర‌గ్స్‌ను తీసుకున్న వారికి నిర్బంధంగా వైద్యం అందిస్తారు. వారిని డీటాక్సిఫికేష‌న్ సెంట‌ర్ల‌కు పంపుతారు.
  • ఇరాన్‌, ఇండోనేషియాల‌లో డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డితే వారికి మ‌ర‌ణ‌శిక్ష వేస్తారు.

  • డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, చెక్ రిప‌బ్లిక్ దేశాల్లో డ్ర‌గ్స్ వాడ‌డం, అమ్మ‌డం పెద్ద నేరం కాదు.
  • ఉరుగ్వేలో వీటిపై ఎలాంటి నిషేధం లేదు. 2013లో మారిజూనాను చట్టబద్దం చేసిన‌ ప్రపంచంలోనే తొలి దేశంగా రికార్డులకు ఎక్కింది. ఇక్కడి ఔషధాల దుకాణాల్లో ఒక్కొక్కరు నెలకు 40 గ్రాముల వరకు గంజాయి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ‘కానబిస్‌ క్లబ్‌’లోని సభ్యులు తమ ఇళ్లలో స్వయంగా ఆరు గంజాయి మొక్కలను పెంచుకోవచ్చు.
  • స్పెయిన్‌ అయితే ఏకంగా తమ దేశంలో డ్రగ్స్‌ను వినియోగించుకోవచ్చని, దీనిపై ఎలాంటి నిబంధనలు లేవని ప్రకటించింది.
  • అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జపాన్‌ మాత్రం డ్రగ్స్ విషయంలో కఠినమైన చట్టాలను అవలంబిస్తోంది. డ్ర‌గ్స్ అమ్మినా, తీసుకున్నా మ‌న దేశంలోలాగే శిక్ష‌లు వేస్తారు.

Comments

comments

Share this post

scroll to top