శుభ‌లేఖ అంటే… ఇలా కూడా ఉండొచ్చు… వెరైటీగా… డిఫ‌రెంట్‌గా..!

మొన్నా మ‌ధ్య జ‌రిగిన మైనింగ్ డాన్ గాలి జనార్ద‌న్ రెడ్డి కూతురి పెళ్లి చూశారు క‌దా..! వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో చేశాడ‌త‌ను. దానికి ముందుగా ఇచ్చిన శుభ‌లేఖ‌ల‌నే అత్యంత వైవిధ్య‌భ‌రితంగా, విభిన్న‌మైన శైలిలో డిజైన్ చేయించాడు. దీంతో గాలి పెళ్లి శుభ‌లేఖ‌ల టాపిక్ హాట్ హాట్‌గా మారింది. అయితే కేవ‌లం అదే కాదు… బ‌డాబాబులు మొద‌లుకొని నేడు అనేక మంది త‌మ త‌మ పెళ్లి శుభ‌లేఖ‌ను వినూత్న‌మైన రీతిలో డిజైన్ చేయిస్తున్నారు. గాలి లాగా కొంద‌రు వీడియో లేఖ‌ల‌ను పంపుతుంటే కొంద‌రేమో సీడీలు, ఇంకా కొంద‌రు ర‌క ర‌కాల ప‌ద్ధ‌తుల్లో శుభ‌లేఖ‌లను డిజైన్ చేయిస్తున్నారు. అయితే అంద‌రిలా శుభ‌లేఖ చేయిస్తే వెరైటీ ఏం ఉంటుంద‌నుకున్నాడో ఏమో… ఆ వ్య‌క్తి ఏకంగా ఆధార్ కార్డు డిజైన్‌తో త‌న పెళ్లి శుభ‌లేఖ‌ను చేయించాడు.

variety-wedding-card

అత‌ని పేరు కొత్త‌ప‌ల్లి మూర్తి. ఉంటోంది తూర్పు గోదావ‌రి జిల్లాలోని బుర్రిలంక‌. చేస్తుంది న్యాయ‌వాద వృత్తి. అయితే అతనికి ఫిబ్ర‌వ‌రి 1న పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ క్ర‌మంలో పెళ్లి కోసం బంధువులు, స్నేహితులను ఆహ్వానించేందుకు గాను అత‌ను శుభ‌లేఖ‌లు కూడా అచ్చు వేయించాడు. అయితే ఆ శుభ‌లేఖ‌లు ఏ డిజైన్‌లో ఉన్నాయో తెలుసా..? ఆధార్ కార్డును పోలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మూర్తి త‌న పెళ్లి కార్డును ఇచ్చి ఆహ్వానించిన‌ప్పుడు ఆ కార్డును చూసిన వారు మొద‌ట షాక్‌కు గుర‌య్యారు.

ఆధార్ కార్డు ఇచ్చి పెళ్లి అంటాడేమిట‌బ్బా..? అని అంద‌రూ ఆశ్చర్యానికి లోన‌య్యారు. అయితే అంత‌లోనే తేరుకుని కార్డును నింపాదిగా చూసే స‌రికి అందులో వివాహ ఆహ్వానం క‌న‌బ‌డింది. వ‌ధూ వ‌రుల పేర్లు, వివాహం జ‌రిగే తేదీ, స్థ‌లం వంటి వివ‌రాలన్నీ ఆ కార్డులో ఉన్నాయి. దీంతో ఆ కార్డును చూసిన వారు మొద‌ట ఖంగు తిన్నా, ఆ త‌రువాత అది పెళ్లి శుభ‌లేఖే అని తెలిసి విస్మ‌యం చెందారు. అవును మ‌రి..! ఒక్కో వ్య‌క్తిది ఒక్కో డిఫ‌రెంట్ టేస్ట్‌. అందుకు అనుగుణంగానే ఏ వ్య‌క్తి అయినా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. ఏది ఏమైనా… పైన చెప్పిన మూర్తి ఐడియా బాగుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top