బయటపడ్డ మరో కోణం..! విజయ్-వనితల విడాకులకు కారణం ఆ న్యూడ్ వీడియో అంట..?

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తమ కుమారుడి ఆత్మహత్యకు అతడి మాజీ భార్య వనితారెడ్డే కారణమని విజయ్ సాయి తల్లితండ్రులు ఆరోపించిన నేపథ్యంలో వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. విజయ్ ఒక అమ్మాయితో న్యూడ్‌గా ఉన్న వీడియో వనిత కంట పడడంతో ఆమె అతడికి దూరమైందని, ఆ తర్వాత విడాకులు తీసుకుందని చెబుతున్నారు. అయితే విడాకుల కోసం భర్త నుంచి భారీగా భరణాన్ని డిమాండ్ చేసిందని, అందుకోసమే అతడి కారును కూడా తీసుకెళ్లిందని సన్నిహితులు వెల్లడించారు.

వారిద్దరికీ ఓ పాప ఉందని, ఆ పాప ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని, పాపంటే విజయ్‌కు ఎంతో ఇష్టమని, ఆ పాపను కూడా తన నుంచి వనిత దూరం చేస్తుందని భయపడి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందిన విజయ్ సాయి శవాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికాసేపట్లో పోస్టుమార్టం జరగనుంది.

Comments

comments

Share this post

scroll to top