అప్పుడే వారిద్దరి మధ్య కళ్లు – కళ్లు కలిశాయట..! ఐపీఎల్ వేలం పాటలో బజర్ నొక్కినప్పుడల్లా..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్‌ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు.

ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్‌ టేబుల్‌ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్‌ను రైజ్‌ చేయడంలో ఆకాశ్‌ ముందంజలో కనిపించాడు.

ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్‌ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్‌ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్‌ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్‌ క్రికెట్‌ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్‌ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది.

ఇదిలా ఉండగా…ముంబై ఇండియన్స్ టేబుల్ పై నీతా అంబానీ, ఆకాష్, టీం సభ్యులు ఉన్నారు. ఆ పక్కనే కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి జూహ్లీచావ్లా కుమార్తె జాన్వీ కూడా ఫస్ట్ టైం ఆక్షన్ కు వచ్చింది. వేలం పాటలో బజర్ నొక్కినప్పుడల్లా.. జాన్వీ చూపు ముంబై ఇండియన్స్ టేబుల్ పై ఉన్న ఆకాష్ వైపు పడిందంట.

కొత్త ఆటగాడు వేలం ప్రారంభం కాగానే.. ఆకాష్ కూడా నైట్ రైడర్స్ టేబుల్ పై ఉన్న జాన్వీ వైపు చూడటం కనిపించిందంట. వేలం పాటలో బజర్ నొక్కిన ప్రతిసారీ ముంబై ఇండియన్స్ టేబుల్ వైపు లుక్స్ వేయటం.. ముసిముసిగా నవ్వటం కనిపించిందంట జాన్వీ.. ఇద్దరు బిగ్ బిజినెస్ మ్యాన్ పిల్లల మధ్య కళ్లూ కళ్లు కలిశాయి అంటోంది బాలీవుడ్. మరిదేక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top