వార్థా తుఫాన్ అంతకంతకు పెరిగే అవకాశాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తమైన రైల్వే శాఖ నెల్లూరు, చిత్తూరు మీదుగా చెన్నై వెళ్లే పలు రైళ్లను నిలిపి వేసింది. ప్రయాణికుల సౌకర్యారార్థం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రైళ్ల రాకపోకల కోసం ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.
విజయవాడ: 0866- 2575038
నెల్లూరు: 0861- 2345864
గూడురు: 9604506841
గుంతకల్లు: 08852-229780
వార్ధా తుఫాన్ ఉదృతమవుతున్న నేపథ్యంలో ఈ క్రింది జాగ్రత్తలు తప్పకపాటించండి..
- ఈదురు గాలుల నేపథ్యంలో అసలు బయటకు రావద్దు
- విద్యుత్ స్థంబాలు, హోర్డింగుల కిందకు వెళ్లవద్దు
- అవసరం లేకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేయడం మేలు
- అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకండి
- ఫోన్లలో ఛార్జింగ్, బ్యాటరీ లైట్ లను ఫుల్ గా నింపుకొండి .
- వదంతులు నమ్మవద్దు.. పూర్తి సమాచారం కోసం అధికారులను సంప్రదిస్తేనే మేలు
- స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయండి
- తగినంతగా ఆహరం, నీళ్ల సదుపాయాన్ని ఏర్పాటు చేసుకొండి
- చిన్న పిల్లలను బయటకు వదలకండి
- వాట్సాఫ్, ఫేస్ బుక్ లలో….. తుపాను గురించిన అసత్య పోస్టింగ్ లను పెట్టకండి.