వారణాసి: నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి 18 మంది మృతి..!

Siva Ram

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లో కొంత భాగం కూలిపోవడంతో 18 మంది మృతి చెందారు.

ఘటనా స్థలం నుంచి వచ్చిన ఫొటోలను చూస్తే దుర్ఘటన తీవ్రత అర్థమవుతోంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో 12 మంది మృతి చెందారని పీటీఐ వార్తా సంస్థ తొలుత వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పందిస్తూ.. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారణాసి వెళతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి.. సంఘటన జరిగిన వెంటనే స్థానికులంతా బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు.

సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం వారణాసి వెళుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తగిన సహాయం అందించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.

Watch Video:

Comments

comments