నా పనితనంతో నాపైన పుకార్లు చేస్తున్న అందరి ము** మీద తంతా – వరలక్ష్మి శరత్ కుమార్!!

రాధికా – శరత్ కుమార్ గారి కుమార్తె అయిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రజలకు బాగా సుపరిచితురాలు. ఆమె నటించిన పందెం కోడి 2, సర్కార్, మారి 2 చిత్రాలు 2018 లో విడుదలయ్యాయి, అయితే కొంత కాలంగా హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తల్ని ఆమె కొట్టేసారు, మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని సర్కార్, పందెం కోడి 2 చిత్రాల ప్రచారం లో ఆమె తెలుగు చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో తెలిపారు.

నన్ను కిందకు ఎవరు లగాలనుకుంటున్నారో నాకు తెలుసు :

ఆమె ఎన్ని సార్లు చేప్పినా, చాలా మంది పాత్రికేయులు ముఖ్యంగా ఆన్ లైన్ వెబ్ సైట్స్ వాళ్ళు ఆమెకు త్వరలోనే పెళ్లి కానుంది అని, అది కూడా విశాల్ తోనే అని రకరకాల పుకార్లతో ఆర్టికల్స్ రాసి ప్రచురణ చేస్తున్నారు, దీని పైన వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “నేను పెళ్లి చేసుకొని పరిశ్రమను వదిలేస్తానని కొందరు కలలు కంటున్నారు. నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉండి నటిస్తూనే ఉంటాను. అలాంటి చెత్త రాతలు రాసే వారి ముడ్డి మీద తన్నడం ఖాయం. నా స్టేట్‌మెంట్‌తో భంగపడిన వారికి బెటర్ లక్ నెక్ట్స్ టైం. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను ఎవరూ తొక్కేయ్యలేరు” అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.

ఆమెకు నెటిజన్స్ కూడా సపోర్ట్ గా నిలిచారు, ఆమె పైన చెత్తఆర్టికల్స్ రాస్తున్న వారి పైన విరుచుకుపడ్డారు నెటిజన్స్. 2019 లో అయినా ఆమె పెళ్లి గురుంచి పుకార్లతో కూడిన ఆర్టికల్స్ రాయడం మానేయాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా కూడా, జయ టెలివిజన్‌లో ప్రసారం అయ్యే సామాజిక చైతన్యాన్ని కలిగించే ‘ఉన్నైఅరిందల్’ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్.” ఉన్నైఅరిందల్ కార్యక్రమం ద్వారా చాలా మంది తమ నైజాన్ని మార్చుకున్నారు. వచ్చే ఏడాది సమాజంలో మరింత మార్పు తెచ్చేందుకు ప్రయత్నిద్దాం”, అని వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్ చేశారు.

 

Comments

comments

Share this post

scroll to top