లైవ్ షోలో…హీరో & డైరెక్టర్ ల మద్య మాటల యుద్ధం. 5 వ తరగతి పిల్లాడినా క్లాస్ పీకుతున్నావ్.!?

‘కమ్మ కమ్మ కమ్మనైన పగ…కాపు కాపు కాపుగాసే వేళ’ అంటూ సాగే పాటను టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా, తెలుగులో చివరి సినిమా అయిన ‘వంగవీటి’లో ఉంటుందని ఈ మధ్యే రిలీజ్ చేశాడు. బెజవాడ ఫ్యాక్షన్, రౌడీ  రాజకీయాల నేఫధ్యంగా తన సినిమా ఉండబోతుందని చెప్పాడు. ఈ సాంగ్ విడుదలవ్వడం, ఈ సినిమా వర్మ ప్రకటించగానే సంచలనం సృష్టించింది. ఇక బెజవాడ రాజకీయాల గురించి తనకన్నా బాగా తెలిసినవాడు లేడని వర్మ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆయన సిద్ధార్థ్ కాలేజ్ లో చదువుకున్నాడు అనేది వేరే విషయం .

అయితే వర్మ మరో ‘రక్తచరిత్ర ‘ లాంటి సినిమా చేస్తున్నాడని, విజయవాడ కమ్మ,కాపు మధ్య చిచ్చుపెడుతున్నాడని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో కథానాయకుడు శివాజీ కమ్మ, కాపు మధ్య గొడవలు చెలరేగేలా సినిమా చేయడం ఇప్పట్లో  ఎందుకని? సమాజం పట్ల అవగాహన, బాధ్యత ఉండాలని, ఇన్ డైరెక్ట్ గా ఈ సినిమా చేయడం అవసరమా? అని లైవ్ లో మాట్లాడుతున్న వర్మతో అన్నాడు. దీనికి సమాధానంగా ‘అంటే సమాజం పట్ల  నాకుఅవగాహన లేదా? కుల రాజకీయాలతో సినిమా చేస్తున్నానని మీతో చెప్పాన? నేనేమైనా 5 వ తరగతి పిల్లాడినా క్లాస్ పీకుతున్నావ్ అని  అని తనదైన స్టైల్ లో వర్మ శివాజీకి సమాధానమిచ్చాడు వర్మ… చివరగా శివాజీ మాట్లాడుతూ మీరు చెప్పింది వేదం, మేము చెబితే క్లాస్ పీకుతున్నట్టుందా? అని అన్నారు.

Watch Video:

 

 

Watch Song:

Comments

comments

Share this post

scroll to top