హ‌లో అంటూ క‌వ్విస్తుంది.. ఆ త‌రువాత కైపెక్కిస్తోంది.. వ‌ల‌లో ప‌డ్డారో గోవిందా.! అసలు కథేంటంటే..?

టెక్నాల‌జీ జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న కాల‌మిది. నెట్ వ‌ర్క్ ల ఫ్రీ ఆఫ‌ర్ లతో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తున్నాయి. ఇక అందులో ఫ్రీ ఇంట‌ర్ నెట్ తో యువ‌త ఆనందానికి అడ్డు లేకుండాపోతుంది. ఇదే అద‌నుగా భావించిన కొంద‌రు లేడీలు.. కేడీల్లా మారి యువ‌కులకు గాలం వేస్తున్నారు. హాయ్ అంటూ మాట‌లు క‌లిపి భాయ్ అంటూ చెక్కెస్తున్నారు. అలాంటి మెసెజ్ ల వ‌ల‌లో మీరు కూడా ప‌డ్డారో ఇక గోవిందా.. ఆన్ లైన్ లో మీ ఇల్లు గుళ్ల‌వ‌డం గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

హాయ్ అంటు ఫేస్ బుక్ లో మెసేజ్ పెడతారు. ఆ త‌రువాత మెల్లిగా చాటింగ్ మొద‌లెడుతారు. మాట‌లు క‌లిపి ఫోన్ నెంబ‌ర్ సంపాదిస్తారు. వాట్స‌ప్ లోకి ఎంట్రీ ఇచ్చి పూర్తిగా ముగ్గులోకి దింపుతారు. వారి మాయ‌లో ప‌డ్డామ‌ని తెలియ‌డ‌మే ఆల‌స్యం వీడియో ఛాట్ లోకి వ‌చ్చేసి మ‌రింత కైపెక్కిస్తారు. ఇక అంతే సంగ‌తులు.. మీకు సంబందించిన ఆన్ లైన్.. ఈ మెయిల్.. జీ మెయిల్.. బ్యాంక్ పాస్ వ‌ర్డ్ ల‌న్నింటిని మూట ముల్లెగా స‌ర్దుకుని జంప్ అవుతారు. తీరా అస‌లు విష‌యం తెలిశాక నెత్తి నోరు కొట్టుకున్నా లాభం లేదంటున్నారు సైబ‌ర్ నిపుణులు.

Close up of teenage girl texting on mobile in bedroom

తాజాగా ఇలాంటి ఘ‌ట‌న‌లు హైద‌ర‌బాద్, తిరుప‌తి లాంటి మ‌హ న‌గ‌రాల్లో విజృంభిస్తున్నాయి. తిరుపతిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువకుడికి పది రోజుల క్రితం మిస్డ్‌ కాల్‌ వచ్చింది. మొదట పట్టించుకోలేదు. త‌రువాత రోజు మళ్లీ అదే నంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ రావడంతో తెలిసిన వాళ్లేమో అని కాల్ లిఫ్ట్ చేశాడు. అమ్మాయి గొంతు వినిపించ‌డంతో ఎవ‌ర‌ని అడిగాడు.. ఆ యువ‌తి స్వారీ అండి ప‌వ‌నేనా అంటూ మాటలు క‌లిపింది. అదే రోజు వాట్స‌ప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత వీడియో కాల్స్ రాత్రంతా ఛాటింగ్. ఓ రోజు ఉద‌యాన్ని ఏడుస్తూ ఫోన్ చేసి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను అర్జెంటుగా ఓ 10 వేలు కావాలి ఎవ‌రిని అడ‌గాలో తెలియ‌డం లేదంటు మొర‌పెట్టుకుంది. మ‌నోడు క‌రిగిపోయి వెంట‌నే అకౌంట్ డీటైల్స్ చెప్ప‌డ‌మే కాదు ఆన్ లైన్ పాస్ వ‌ర్డ్స్ అన్ని పూస గుచ్చిన‌ట్టి చెప్పి.. 10 వేలు త‌న అకౌంట్ కి పంపించాడు. సీన్ క‌ట్ చేస్తే.. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్.. నో ఫోన్ కాల్స్.. నో మెసెజ్ అస‌లు విష‌యం తెలిసి ఆ సాప్ట్ వేర్ నోరెళ్ల బెట్టాడు. హైద‌రాబాద్ బంజార‌హిల్స్ లో సేమ్ సీన్ సేమ్ ఫోన్ కాల్..  రిపీట్.. సీన్ క‌ట్ చేస్తే అమ్మాయి 20 వేల‌తో జంప్.shutterstock_271905110-390x285

ఇలా మ‌హ‌న‌గ‌రాల్లో అబ్బాయిలే టార్గెట్ గా రెచ్చిపోతున్న కేసులో సైబ‌ర్ క్రైమ్ కి పోటెత్తుతున్నాయి. సో బీ కేర్ ఫుల్. ఇలాంటి కాల్స్ మీకు కూడా వ‌చ్చుంటే అవైడ్ చేయ‌డ‌మే ఉత్త‌మ‌మం. ఆ ఏం అవుతుంది లే అని కంటిన్యూ అయ్యారో ఇక మీ ఇళ్లు గుల్లే.

Comments

comments

Share this post

scroll to top