ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి గురించి ఈ 4 విషయాలు తెలుసా..? ఈ రోజు “అన్నం” ఎందుకు వండకూడదు అంటే..?

ఒక్క ఏడాదిలో వచ్చే  ఇరవైనాలుగు ఏకాదశులులో ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే..వాటిల్లో ప్రత్యేకమైన  ఏకాదశులు నాలుగు.  వాటిల్లో ఒకటే వైకుంఠ ఏకాదశి..ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు..హిందువులకు  అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు.అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం ..ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అంటారు.దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?

  • ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనికే వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.
  • దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే.
  • మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం.
  • వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు.దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.

couple-pooja-2

ముక్కోటి ఏకాదశి నాడు అన్నం ముట్టకూడదంటారు ఎందుకు?

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అనే దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు..

Comments

comments

Share this post

scroll to top