సరిగ్గా వివాహం జరిగే సమయానికి పెళ్లి కూతురో లేదంటే పెళ్లి కుమారుడో మండపం నుంచి జంప్ అవడం కామనే. సినిమాల్లో అయితే ఇలాంటి ఘటనలను మరింత ఆసక్తికరంగా చూపిస్తారు. ఇక రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే చాలా అరుదుగా జరుగుతాయి. తాజాగా ఆ ప్రాంతంలోనూ సరిగ్గా ఇలాంటి జంపింగ్ ఘటనే పెళ్లిలో చోటు చేసుకుంది. ఇందులో ఇంకా వింత ఏముందంటే… పెళ్లి టైమ్‌కు పెళ్లి కూతురే కాదు, పెళ్లి కొడుకు కూడా జంప్ అయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. షాకింగ్‌గా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంతకీ.. అసలు ఏం జరిగిందంటే…
కర్ణాటక రాష్ట్రంలోని చన్నకల్లు అనే గ్రామానికి చెందిన ఓ యువకుడికి బంగారుపేట తాలుకా నేర్నహళ్ళి గ్రామానికి చెందిన ఓ యువతికి వారి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయం చేశారు. జనవరి 27న వివాహ ఎంగేజ్మెంట్ , జనవరి 28న వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతా బాగానే ఉంది. అయితే సరిగ్గా ఎంగేజ్మెంట్ టైమ్‌కు మండపం నుంచి పెళ్లి కూతురు జంప్ అయింది. దీంతో షాక్ అయిన వరుడి తరఫు బంధువులు వధువుకు చెందిన ఓ బంధువు కుమార్తెతో ఎంగేజ్మెంట్ జరిపించారు.
అయితే చివరకు పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజున సరిగ్గా పెళ్లి టైమ్‌కు ముందు బయటకు వెళ్లి షేవింగ్ చేయించుకొస్తానని వరుడు చెప్పి మండపం నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో పెళ్లి కుమారుడు జంప్ అయ్యాడని తెలుసుకున్న ఇరు వర్గాల వారు పెళ్లి రద్దు చేశారు. అయితే పెళ్లి కుమారుడు ఎందుకు జంప్ అయ్యాడో కారణం తెలియదట కానీ అంతకు ముందు నిశ్చయించిన పెళ్లి కుమార్తె మాత్రం తాను వేరే యువకున్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి నుంచి జంప్ అయింది. దీంతో చేసేదేం లేక మండపం నుంచి ఇరు వర్గాల వారు నిష్క్రమించారు. ఇక పెళ్లి కోసం చేయించిన వంటలు అలాగే మిగిలిపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా నిజంగా ఈ రెండు జంపింగ్ ఘటనలు షాకింగ్‌గా ఉన్నాయి కదా..!
https://telugu.oneindia.com/news/telangana/bride-groom-flee-marriage-just-before-ceremony-220909.html