వద్దు వద్దు అంటున్నా…రియాలిటీ షోలో మైనర్ అమ్మాయికి ముద్దు పెట్టిన సింగర్..! జడ్జిగా వచ్చి ఇవేం పనులు.?

టివిలలో వచ్చే రియాల్టి షోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాం..చిన్నపిల్లల రియాలిటి షోలకు కొదవే లేదు..అందులో వాళ్లు ముద్దుముద్దుగా పాటలు పాడుతుంటే,డ్యాన్స్ చేస్తుంటే చూసి మురిసిపోతాం.పట్టుమని పదేండ్లు కూడా లేని చిన్నారులు వారి హావభావాలు చూసి శభాష్ అనకుండా ఉండలేం…పిల్లలు చేసే చేష్టలకు ముద్దు చేస్తాం.కాని పిల్లల టాలెంట్ ని ఎంకరేజ్ చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రం పిల్లలతో విశృంకలంగా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది..పిల్లలపై చూపే కేరింగ్ కేవలం తెరమీదకే పరిమితం తెరవెనుక జరిగే రియాలిటి వేరు అని ప్రపంచానికి చూపించింది.

ప్రముఖ అస్సామీ సింగర్ పాపోన్.. హోలీపై ఓ రియాల్టీ షో చేశాడు. ఈ షోలో పాల్గొన్నది అందరూ చిన్న పిల్లలు. అందరి వయస్సు 13 ఏళ్ల లోపు అమ్మాయిలే. అందరికీ రంగులు పూస్తూ..పాటలు పాడుతూ గంతులేస్తున్న సింగర్ పాపన్ హడావిడి చేశాడు. చిన్నారుల ముఖాలపై రంగులు పూశాడు. అంతటితో ఆగలేదు. ముద్దులు పెట్టాడు. హోలీ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షో ప్రమోషన్ కోసం.. కొంత భాగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.ఆ పోస్ట్ లోని వీడియోలో ఓ అమ్మాయి ముఖంపై రంగు పూసి.. ముద్దు పెట్టాడు.

ఆ అమ్మాయి వద్దూ వద్దూ అని వారిస్తున్నా వినకుండా బలవంతంగా కిస్ చేసాడు.ఆ వీడియోలో క్లియర్ గా ఉంది చిన్నారి వద్దంటూ వారించేది..నిజంగా పిల్లల్ని ముద్దు చేస్తే ఎవరూ కాదనరు..కాని ఎదుటివారు ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారనేది మాత్రం అర్దం అయిపోతుంది..అక్కడ పాపోన్ ప్రవర్తన ఎలా ఉందనేది ఆ చిన్నారి స్పందనని బట్టి తెలుసుకోవచ్చు.  దాంతో.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. చిన్న అమ్మాయిలతో ఇలా ప్రవర్తించటానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలీవుడ్ సింగర్ పాపోన్ పై పోస్కో యాక్ట్ కింద ( మైనర్లపై లైంగిక వేధింపుల కింద) కేసు పెట్టారు. ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది.ప్రపంచంలో ఏదో మూల,ప్రతిక్షణం అమ్మాయిలు నిత్యం ఏదో ఒక అఘాయిత్యానికి గురవుతూనేఉన్నారు..పెరుగుతున్న విశృంఖలత్వాన్ని స్వేఛ్చగా భావిస్తూ పోతే ఆడపిల్ల భవిష్యత్లో గడప దాటి బైటికి రావడం కాదు కదా..కనీసం వారి ఇళ్లల్లో కూడా వారికి రక్షణ ఉంటుందా అనేది ప్రశ్నార్ధకం అవుతుంది..

watch video here:

Comments

comments

Share this post

scroll to top