బ్రిటీషర్లను ఎదిరించిన మొనగాడు! 30 యేళ్లు ఉరికొయ్యకి వేలాడిన అతని “తల” వెనకున్న నిజం!

స్వాతంత్ర్యానికి పూర్వం…మన ప్రాంతంలో బ్రిటీష్ అరాచక పాలన కొనసాగుతున్న సందర్భంలో…బ్రిటీష్ పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేసిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. అతడే ఒక సైన్యంగా ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేశాడు. ఇతని మీద పగ పెంచుకున్న బ్రిటీషర్లు…ఇతనిని బంధించి ఉరిశిక్ష వేసి, తలను శరీరం నుండి వేరు చేసి, కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు వ్రేలాడదీశారు. 1847లో ఉరివేస్తే..ఇతని తలను 1877 వరకు అలాగే వేలాడదీశారు…అంటే 30 సంవత్సరాల పాటు..ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తలను వేలాడదీసే ఉంచారు.

30 యేళ్లు వేలాడిన తల వెనుకున్న కథ:
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమలో స్థానిక నాయకులుగా వ్యవహరించే పాళెగాండ్లలో ఒకడు. 18వ శతాబ్దంలో నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.

తమ మీద ఆదిపత్యాన్ని ప్రదర్శించే…. బ్రిటీష్ పాలకులంటే నరసింహా రెడ్డికి గిట్టేది కాదు. దాదాపు 66 గ్రామాలకు నాయకుడిగా ఉన్న నరసింహారెడ్డి ప్రజలకు రక్షణగా ఉండేవాడు. తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి 1846 జూన్‌లో కోయిలకుంట్ల ఖజానాకు పంపుతాడు నరసింహారెడ్డి, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో…అప్పటికే ఆంగ్లేయ పాలన మీద కోపంగా ఉన్న ఉయ్యాలవాడ….తిరుగుబాటు జెండాను ఎగురవేస్తాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేఖంగా ఉన్న కొంత మంది చిన్నచిన్న రాజులతో మాట్లాడి ఓ సంస్థను ఏర్పాటు చేశాడు.

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల తీసుకెళతాడు , బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. అతనిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని కూడా ప్రకటించింది. అప్పటికే అతని కుటుంబాన్ని బంధిస్తారు బ్రిటీష్ పాలకులు. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించారు . 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

#ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు, కానీ జానపద వీరగాథల్లో మరణం లేని పోరాట వీరుడు అతను, బ్రిటీష్ సైన్యాన్ని ఎదురించొచ్చని…స్పూర్తినిచ్చిన విప్లవయోధుడతడు. భారతీయుల సత్తా ఎలా ఉంటుందో ఆంగ్లేయులకు రుచి చూపించిన ధీశాలి అతడు.

నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి:

144418647mahabubnagar_pangal_fort_main

నరసింహారెడ్డి సేన తమ ఫిరంగిలో వాడిన ఇనుప గుండు:

100px-piragi_lo_vaadina_iron_gundu

Infograhic on rape culture in india

Comments

comments

Share this post

scroll to top