రామ్ చరణ్ గురించి ఉత్తేజ్ కూతురు ఎంత సక్కగ పాడిందో..హిట్ట‌మ్మా హిట్ట‌మ్మా….! (Video)

రంగస్థలం సినిమాతో రాంచరణ్ పేరు మారుమోగిపోతుంది..ఎంతటి పేరొచ్చిందంటే రంగస్థలం కి ముందు,రంగస్థలం తర్వాత రాంచరణ్ వేరు అని చెప్పుకునేటంత..సినిమా ఒక ఎత్తైతే పాటలు అంతే ధీటుగా ఉండి ప్రేక్షకుల మదిని దోచాయి..వాటిల్లో రంగమ్మా మంగమ్మా అంటూ సమంతా అందరిని ఆకట్టుకుంది..ఇప్పుడు ఆ పాటకి పేరడిగా వచ్చిన మరో పాట యూట్యూబ్లో దుమ్మురేపుతుంది..ఇంతకీ ఆ పాట పాడిందెవరో తెలుసా…దానికి ఆట కట్టిందెవరో తెలుసా..

నటుడు,మాటల రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు “పాట” పాడిన ఈ పాటే యూట్యూబ్లో రంగమ్మా మంగమ్మ పాటను మించిపోయింది..ఆ పాట బాగుంది,ఈ పాట సూపర్ అంటూ పాటల గురించి గొప్పగా చెప్పుకుంటాం కాని ఆ పాటనే పాపకు పేరుగా పెట్టాలనుకున్న ఉత్తేజ్ కి పాటంటే ఎంతిష్టమో అర్దమవుతుంది కదా..ఇప్పుడు ఆ పాప “పాట” పెద్ద అయ్యి పాట పాడడమే కాదు,పాటకి ఆట కూడా పాడేస్తుంది..తన ఆటపాటతో అందరిని ఆశ్చర్యపరుస్తున్న “పాట” వయసెంత అనుకుంటున్నారు పదేళ్లు…

రంగమ్మా మంగమ్మా అనే పాటకి పేరడిగా రాంచరణ్ ని ఉద్దేశించి జర్నలిస్టు ప్రభు ఒక పేరడి పాట రాశారు..ఓరయ్యో ఓలమ్మో అంటూ సాగే ఈ పాటకే పాట పాడి ఆడింది.రామ్ చరణ్‌ని,రంగస్థలంలో తన నటనని ప్రశంసలతో ముంచెత్తుతూ ‘రంగస్థలం’ సెట్స్‌లో పాట తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ పేరడీ సాంగ్ అసలు పాటను మించి ఉండటం విశేషం.ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన ఈ పాటను డైరెక్ట్ చేసింది..అంతేకాదు స్వతహాగా డ్యాన్సర్ అయిన చేతన డైరెక్షనే కాదు కొరియోగ్రాఫర్ శ్రీనాథ్‌తో కలిసి కొరియోగ్రఫీ కూడా చేసింది.యూట్యూబ్లో హవా కొనసాగిస్తున్న ఈ పాట మీరూ చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top