(-1)+(-1)=0 ఏమైనా డౌట్స్ ఉంటే…ఇదిగో ఈ విద్యాశాఖ‌ మంత్రి గారిని అడ‌గండి! ప‌రువుమొత్తం సోష‌ల్ మీడియాలో కొట్టుకుపోయింది!

ఆయ‌న ఓ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి….ఆయ‌న గ‌ణిత‌శాస్త్ర ప్రావీణ్యం అంతా ఇంతా కాదు….అందుకే ఓ లెక్క‌ల టీచ‌ర్ కే లెక్క‌లు చెప్పి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు.! వార్త‌లోకి వ‌స్తే…ఉత్తరాఖండ్‌ విద్యాశాఖమంత్రి అరవింద్‌ పాండే అనూహ్యంగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లో గణితం బోధిస్తున్న టీచర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి…. మైనస్‌ ప్లస్‌ మైనస్‌(-)+(-)= మైనస్‌(-) వస్తుందా ప్లస్‌(+) వస్తుందా అని ప్రశ్నించారు. దీనికి ఈ టీచర్‌ మైనస్‌ అని చెప్పగా దానికి అడ్డు చెప్పి…స‌ద‌రు మంత్రిగారు ఆయ‌నే ప్ర‌తిపాదించిన కొత్త సిద్దాంతం ప్ర‌కారం…మైన‌స్ ప్ల‌స్ మైన‌స్(-)+(-)= (+) ప్లస్ అవుతుంద‌ని చెప్పి …ఏం లెక్క‌లు చెబుతున్నార‌ని టీచ‌ర్ పై మండిప‌డ్డారు.!

మ‌న మంత్ర‌గారి అజ్ఞానానికి అక్క‌డే బ్రేక్ ప‌డ‌లేదు..ఇంకాస్త ముందుకెళ్ళిన మంత్రిగారు. (-1)+(-1)=0 అని సెల‌విచ్చారు. పాపం ఆ టీచ‌ర్ కాదు సార్ (-1)+(-1)= -2 అని ఎంత చెప్పినా విన‌లేదు.అంతే కాదు లెక్క‌లు త‌ప్పుగా చెబుతుంద‌ని ఆ టీచ‌ర్ ను వారం రోజుల పాటు స‌స్పెండ్ చేయాల‌ని మౌఖిక అదేశాలు కూడా జారీ చేశారు! ప‌క్క‌నున్న P.A చెప్పిన త‌ర్వాత మంత్రిగారికి జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది.!! ఆ టీచ‌ర్ ను స‌స్పెండ్ చేయ‌మ‌ని చెప్పింది లెక్క‌ల విష‌యంలో కాదు టెక్ట్స్ బుక్స్ ను కాకుండా గైడ్ చూసి లెక్క‌లు చెబుతున్నందుకు అని కొత్త కార‌ణం చెప్పుకొచ్చారు. ఈలోపే బ‌య‌ట‌కొచ్చిన సార్ గారి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది . అది చూసిన నెటీజ‌న్లు. ఇలాంటి వారికా మంత్రి ప‌ద‌వి ఇచ్చేది? అది కూడా విద్యాశాఖ మంత్రి ప‌ద‌వి అంటూ కామెంట్ల‌తో గ‌ట్టి క్లాస్ పీకుతున్నారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top