శిశువు మృత‌దేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు అత‌ను. ఎందుకో తెలిస్తే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు..!

రోజు రోజుకీ స‌మాజం ఎటు వెళ్తుందో నిజంగా అర్థం కావ‌డం లేదు. డ‌బ్బు వ్యామోహంలో ప‌డిన మ‌నిషి తోటి మ‌నిషి క‌ష్టంలో ఉన్నా క‌నిక‌రించ‌డం లేదు. జాలి, ద‌య అన్న‌వి చూప‌డం లేదు. మ‌నుషుల్లో మాన‌త్వ‌వమ‌న్న‌దే లేకుండా పోతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇదే విషయాన్ని స్ప‌ష్టంగా తెలియజేస్తుంది. చిన్నారి మృత‌దేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ సిబ్బంది ఆంబులెన్స్ ఇవ్వ‌లేదు. దీంతో ఆ వ్య‌క్తి ఆ ప‌సికందు శ‌వాన్ని చేత్తో మోసుకుంటూ సైకిల్‌పై తీసుకెళ్లాడు. చెప్పేందుకే అదో ర‌కంగా ఉన్న ఈ సంఘ‌ట‌న‌ను అనుభ‌వించిన వారికి హృద‌యం ఇంకెంత క‌ల‌చి వేసిందో ఆ దేవుడికే తెలియాలి.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మ‌జ్‌హ‌న్‌పూర్‌లో మ‌లాక్ స‌ద్దీ గ్రామానికి చెందిన అనంత్ కుమార్ 7 నెల‌ల కూతురు పూన‌మ్‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. దీంతో అనంత్‌కుమార్ త‌మ గ్రామానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి పూన‌మ్‌ను తీసుకెళ్లాడు. అయితే శిశువును వేరే ఆస్ప‌త్రికి మార్చాల్సి వ‌స్తే డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయేమోన‌న్న ఆలోచ‌న‌తో అనంత్‌కుమార్ డ‌బ్బు కోసం అలహాబాద్ వెళ్లాడు. చిన్నారి బాధ్య‌త‌ను బావ మ‌రిది అయిన బ్రిజ్ మోహ‌న్‌కు అప్ప‌గించాడు. కాగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న పూన‌మ్ అనుకోకుండా మృతి చెందింది.

దీంతో పూన‌మ్ మృత‌దేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు గాను మోహ‌న్ య‌త్నించాడు. అందుకు గాను హాస్పిట‌ల్ సిబ్బందిని ఆంబులెన్స్ కావాల‌ని అడిగాడు. కాగా డ‌బ్బులిస్తేనే గానీ ప‌ని చేయ‌ని ఆ హాస్పిట‌ల్ సిబ్బంది ఆంబులెన్స్‌ను ఇచ్చేందుకు నిరాక‌రించారు. దీంతో మోహ‌న్ చేసేది లేక ఓ చేత్తో శిశువు మృత‌దేహాన్ని మోసుకుంటూ మ‌రో చేత్తో సైకిల్ తొక్కుతూ గ్రామానికి వెళ్లిపోయాడు. అత‌ను అలా వెళ్తున్న క్ర‌మంలో ఎవ‌రో ఫొటోలు తీసి సోష‌ల్ సైట్ల‌లో పెట్టారు. దీంతో ఈ విష‌యం వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలో స‌మాచారం తెలుసుకున్న‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్ కే ఉపాధ్యాయ్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఆంబులెన్స్ డ్రైవర్‌తో పాటూ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ… పేద‌వాడికి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ద‌క్కుతున్న సేవ‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌. ఇంకెప్పుడు వారి బ‌తుకులు మారుతాయో ఆ దేవుడికే తెలియాలి.

Comments

comments

Share this post

scroll to top