మీ ఫోన్‌లో ట్రూ కాల‌ర్ యాప్ వాడుతున్నారా..? దాంతో జాగ్ర‌త్త‌. దుండగులు డ‌బ్బులు దోచేస్తారు తెలుసా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల‌లో ఉండే ట్రూ కాల‌ర్ యాప్ గురించి తెలుసు క‌దా. దాని వ‌ల్ల మ‌నకు తెలియని, మ‌న ఫోన్‌లో లేని ఫోన్ నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే ఆ కాల్స్ ఎవ‌రు చేస్తున్నారో వారి పేరును తెలుసుకోవ‌చ్చు. అది ఎలా సాధ్య‌మ‌వుతుందంటే… అవ‌తలి వ్య‌క్తి త‌నకు తానుగా త‌న నంబ‌ర్‌ను ట్రూ కాల‌ర్‌లో అప్‌డేట్ చేసినా, లేదంటే అత‌ని నంబ‌ర్‌ను అత‌నికి తెలిసిన వేరే వ్య‌క్తులు ఎవ‌రైనా ట్రూ కాల‌ర్ కాంటాక్ట్స్‌కు యాడ్ చేస్తే అప్పుడు ఇక ఆ నంబ‌ర్‌కు ఆ పేరు ఫీడ్ అయిపోతుంది. దీంతో ఆ నంబ‌ర్‌, ఆ పేరు ట్రూ కాల‌ర్ డేటాబేస్‌లో అలా ఉండిపోతాయి. ఈ క్ర‌మంలో ఆ నంబ‌ర్ వాడుతున్న వ్య‌క్తి త‌న‌కు తెలియ‌ని వ్యక్తుల‌కు ఫోన్ చేస్తే, అప్పుడు వారు ట్రూ కాల‌ర్ వాడుతుంటే వారికి ఆ పేరు సుల‌భంగా తెలుస్తుంది.

అయితే దీన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు దుండ‌గులు ఇప్పుడు సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. అదెలాగంటే పైన చెప్పిన విధంగా ఎవ‌రైనా ఏదైనా ఫోన్ నంబర్‌ను ఒక పేరుతో ట్రూ కాల‌ర్ కాంటాక్ట్స్ లో సేవ్ చేస్తారు క‌దా, అయితే దుండగులు ఏం చేస్తున్నారంటే త‌మ ఫోన్ నంబ‌ర్ల‌కు పేరును BANK MANAGER అని పెట్టి ట్రూ కాల‌ర్‌లో సేవ్ చేస్తున్నారు. దీంతో వారు ఎవ‌రికి ఫోన్ చేసినా, అవ‌తలి వ్య‌క్తులు గ‌న‌క ట్రూ కాల‌ర్‌ను వాడుతుంటే వారి స్క్రీన్ పై BANK MANAGER అని పడుతుంది. దీంతో వారు సాక్షాత్తూ BANK MANAGER ఫోన్ చేస్తున్నాడ‌నుకుని వారికి (దుండ‌గుల‌కు) అడిగిన స‌మాచారం అడిగిన‌ట్టు చెబుతున్నారు.

బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్‌, పేరు, మొబైల్ నంబ‌ర్‌, డెబిట్‌, క్రెడిట్ కార్డుల స‌మాచారం అంతా ఇలా దుండగుల‌కు చెబుతున్నారు. దీంతో ఆ దుండ‌గులు పెద్ద ఎత్తున ఒకేసారి డ‌బ్బును విత్ డ్రా చేసుకుంటున్నారు. ఆ త‌రువాత బాధ‌ప‌డ‌డం ప్ర‌జ‌ల వంత‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా నేరాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. క‌నుక ఎవ‌రైనా ట్రూ కాల‌ర్ యాప్‌ను గ‌న‌క వాడుతుంటే కాల్ చేసినప్పుడు, కాల్ వ‌చ్చిన‌ప్పుడు తెర‌పై డిస్‌ప్లే అయ్యే ఫోన్ నంబ‌ర్ల‌ను, పేర్ల‌ను ఒక‌సారి చెక్ చేసుకోవాల‌ని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా ఏ బ్యాంక్ అయినా అలా ఫోన్ చేసి వినియోగ‌దారుల స‌మాచారం అడ‌గ‌రు. క‌నుక ప్ర‌జ‌లు ట్రూ కాల‌ర్ యాప్ వాడేట‌ప్పుడు, ఇలాంటి వారు ఫోన్ చేసిన‌ప్పుడు జాగ్రత్త‌గా ఉండాల‌ని పోలీసులు అంటున్నారు. లేదంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి డ‌బ్బు మాయం అవుతుంద‌ని వారు హెచ్చరిస్తున్నారు..!

Comments

comments

Share this post

scroll to top